Hari Hara Veera Mallu : పవన్ మూవీ వంద కోట్లకి దగ్గరలో.. రెండో రోజు ఎంత రాబట్టింది?
Hari Hara Veera Mallu : దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే. హరిహర వీరమల్లు టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో అంచనాలు పెంచారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. నైజాంలో 37 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, తూర్పు గోదావవరిలో 9.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 7 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్ల రూపాయల మేర జరిగింది.
Hari Hara Veera Mallu : పవన్ మూవీ వంద కోట్లకి దగ్గరలో.. రెండో రోజు ఎంత రాబట్టింది?
దాంతో హరిహర వీరమల్లుకు నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 12.5 కోట్ల మేర బిజినెస్ అయింది. ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు మేర వీరమల్లు బిజినెస్ చేసింది . హరిహర వీరమల్లు చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 104 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 210 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది
హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.12.93 కోట్ల రూపాయలు వచ్చాయి. తొలిరోజు ఇండియా వైడ్ 44.7 కోట్ల రూపాయల నెట్, 52.7 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 11 కోట్ల రూపాయలు కలిపి వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.64 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.రెండో రోజు హరిహర వీరమల్లు చిత్రం ఆంధ్రా, నైజాంలలో 23 కోట్లు.. కర్ణాటక, తమిళనాడు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల చొప్పున సెకండ్ డే వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.
Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
This website uses cookies.