Sekhar Master : రోజాకే వేయడం నేర్పుతున్నాడు.. మళ్లీ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 7, 2021, 9:45 pm

Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలిసిందే. దేనికి దూరంగా వెళ్లాడో.. ఎవరికి దగ్గరయ్యాడో అందరికీ తెలిసిందే. ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్ వెళ్లిపోయాడు. కామెడీ స్టార్స్ షోలో ఫిక్సయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్.. చివరకు కామెడీ షోకు జడ్జ్‌గా మారిపోయాడు. అలా శేఖర్ మాస్టర్ ఇప్పుడు స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇకపై ఈటీవీలో కనిపించడేమో అని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ తన దైన శైలిలో మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు.

Sekhar Master With Roja In Dasara Bullollu Event

Sekhar Master With Roja In Dasara Bullollu Event

ఈటీవీ వచ్చే దసరాకు అదిరిపోయే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దసరా బుల్లోళ్లు అంటూ అందరూ కలిసి వచ్చారు. అయితే ఈ షోకు ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి సందడి టీం స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. కే రాఘవేంద్ర రావు, హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీలా వంటి వారు వచ్చారు. అయితే ఈటీవీకి దూరంగా ఉంటోన్న శేఖర్ మాస్టర్ కూడా వచ్చేశాడు. ఇది అందరికీ షాకింగ్‌గా అనిపించవచ్చు. వచ్చీ రావడంతో శేఖర్ మాస్టర్ మళ్లీ తన పాత రోజులను గుర్తుకు చేశాడు.

Sekhar Master బాణం వేయడం నేర్పిస్తోన్న శేఖర్ మాస్టర్..

Sekhar Master With Roja In Dasara Bullollu Event

Sekhar Master With Roja In Dasara Bullollu Event

రోజా, శేఖర్ మాస్టర్ల డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఒక్కోసారి అది తప్పుతుంది. హద్దులు దాటినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రోజా తన వయసు కూడా మరిచిపోయి రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. డ్యాన్స్ పర్ఫామెన్స్‌లో భాగంగా రోజాకే బాణం వేయడం నేర్పిస్తున్నాడు శేఖర్ మాస్టర్. రాజు, రాణిల గెటప్పులు వేసుకున్న ఈ ఇద్దరూ రొమాంటిక్ పర్ఫామెన్స్ వేసినట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో అమ్మవారిలా రోజా కనిపించింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp