Senior Actress Jamuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం సీనియర్ నటి జమున కన్నుమూత..!!
Senior Actress Jamuna : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసపెట్టి విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు మరికొంతమంది ప్రముఖ దిగ్గజ నటులు మరణించారు. కాగా ఈ ఏడాది జనవరి నెలలోనే అలనాటి అందాల నటి జమున కన్నుమూశారు. 86 సంవత్సరాల వయసు కలిగిన జమున హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వయసు మీద పడటంతో గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు.
దాదాపు 196 సినిమాలలో నటించిన జమున తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో నటించడం జరిగింది. జమున మాతృభాష తెలుగు కాక పోయినప్పటికీ తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోవడం జరిగింది. వాస్తవానికి జమున ఆగస్టు 30వ తారీకు 1936లో కర్ణాటకలోని హంపిలో జన్మించారు. ఆ తర్వాత సినిమా రంగంలో తిరుగులేని హీరోయిన్ గా నటించి..స్టార్ డాం సంపాదించి రాజకీయాల్లో సైతం రాణించడం జరిగింది. కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలలో రాణించారు.
Senior Actress Jamuna Passes Away
1989 నుంచి 1991 వరకు రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. ఫిలిం ఫేర్ తో పాటు అనేక అవార్డులు జమున గెలవడం జరిగింది. ఈ క్రమంలో ఆమె మరణించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. జమున మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కీ భౌతికకాయాన్ని తరలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో కుమార్తె డాక్టర్ స్రవంతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
