Home » Entertainment » Senior Actress Rajasri Nair Key Comments On Samantha Chaithanya Divorce
Entertainment

Rajasri Nair : సామ్ చై విడాకులపై సీనియర్ నటి కీలక వ్యాఖ్యలు.. అలా ఎలా..?

Authored By
mallesh
The Telugu News | Published on: December 29, 2021, 7:00 pm
Advertisement

Rajasri Nair : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటీమణులకు డిమాండ్ బాగా పెరిగింది. క్యారెక్టర్ ఆర్టిసులు లేక తీసుకున్న వారినే మళ్లీ తీసుకోవాలంటే దర్శకులు కూడా వెనకముందు అవుతున్నారని తెలుస్తోంది. మొన్నటివరకు హీరోయిన్ లేదా హీరో తల్లి పాత్రలకు జయసుధ, నదియా, రమ్యకృష్ణ లాంటి వారు కనిపించేవారు. ప్రస్తుతం వీరు సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయారు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే, ఒకప్పుడు హీరోయిన్స్‌గా చేసిన వారంతా ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించారు. అలాంటివారిలో రాజ శ్రీ నాయర్ ఒకరు. ఈ నటి ‘దమ్ము’ సినిమాలో ఎన్టీఆర్‌కు తల్లి పాత్రలో కనిపించింది.

Advertisement

Senior Actress Rajasri Nair Key Comments on Samantha Chaithanya Divorce

Rajasri Nair : నా డైలాగ్ సీన్ తీసేసారు..

దమ్ము సినిమాలో నటించిన టైంలో తనుకు రెండు లేదా మూడు డైలాగులు మాత్రమే ఉన్నాయని అవి కూడా ఎడిటింగ్‌లో తీసేసారని క్యారెక్టర్ ఆర్టిస్టు రాజశ్రీ నాయర్ చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమా షూటింగ్ టైంలో చాలా సీన్లు చిత్రీకరిస్తారని, ఎడిటింగ్ చేసేటప్పుడు అందులో చాలా సీన్లు కటింగ్‌లో పోతాయని తెలిపింది. అదే విధంగా తాను చేసిన సీన్లు కూడా కొన్నిసార్లు ఎడిటింగ్‌లో పోయాయన్నారు. ఎంతో కష్టపడి నటిస్తామని అలాంటప్పుడు మనం చేసిన సీన్లు వెండితెరపై కనిపించకపోతే చాలా బాధగా ఉంటుందన్నారు. శ్రీమంతుడు సినిమాలో తన క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చిందని రాజశ్రీ నాయర్ చెప్పారు.

Advertisement

Senior Actress Rajasri Nair Key Comments on Samantha Chaithanya Divorce

ఇకపోతే సమంత- నాగచైతన్య భార్యభర్తలుగా కలిసి నటించిన మజిలీ సినిమాలో కూడా తాను చేసినట్టు రాజశ్రీ నాయర్ చెప్పుకొచ్చారు. ఆ చిత్రం షూటింగ్ దశలో సమంత, నాగచైతన్యకు రీసెంట్‌గా మ్యారేజ్ అయిందని గుర్తుచేశారు. నాగచైతన్య, నాగార్జున ప్రస్తుతం కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా తాను నటిస్తున్నాని చెప్పిన ఆవిడ.. నాగచైతన్యది ఎంతో మంచి మనసు అని కితాబిచ్చారు. మజిలీ సినిమాలో సమంత, నాగచైతన్యతో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. ఇక సామ్ చై విడాకులు తీసుకున్నారన్న విషయం తెలిసి తను చాలా బాధపడినట్టు రాజశ్రీ నాయర్ పేర్కొన్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి