Senior NTR – Jayaprada : సీనియర్ ఎన్టీఆర్ తో షూటింగ్.. అప్పుడే కాలు జారిన జయప్రద.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Senior NTR – Jayaprada : సీనియర్ ఎన్టీఆర్ తో షూటింగ్.. అప్పుడే కాలు జారిన జయప్రద.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Senior NTR – Jayaprada : సీనియర్ ఎన్టీఆర్ సినీ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువగా శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి హీరోయిన్లు నటించారు. అయితే.. జయప్రదతో తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే అప్పట్లో ఎన్టీఆర్, జయప్రదది హిట్ పెయిర్ అనేవాళ్లు. ఎన్టీఆర్, జయప్రద ఒక హిట్ పెయిర్ కాగా, ఎన్టీఆర్, శ్రీదేవి మరో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 December 2022,4:40 pm

Senior NTR – Jayaprada : సీనియర్ ఎన్టీఆర్ సినీ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువగా శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి హీరోయిన్లు నటించారు. అయితే.. జయప్రదతో తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే అప్పట్లో ఎన్టీఆర్, జయప్రదది హిట్ పెయిర్ అనేవాళ్లు. ఎన్టీఆర్, జయప్రద ఒక హిట్ పెయిర్ కాగా, ఎన్టీఆర్, శ్రీదేవి మరో హిట్ పెయిర్. ఈ జంటల కాంబోలో సినిమా వస్తే.. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టే. ప్రేక్షకులకు పండుగే.

ఎన్టీఆర్, జయప్రద ఇద్దరూ కలిసి నటించిన సినిమాలలో పలు యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో సూపర్ మాన్ అనేది ఒక యాక్షన్ మూవీ. అది అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఓ ఘటన చోటు చేసుకుందట. దానికి సంబంధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ జరుగుతుండగా జయప్రద కాలు జారి కింద పడిందట. అప్పుడు ఎన్టీఆర్ కూడా పక్కనే ఉన్నారట. ఇద్దరితో కలిసి షూటింగ్ జరుగుతుండగా జయప్రద కాలు జారి కింద పడటంతో.. తన కాలు బొటనవేలుకు గాయం అయి తీవ్రంగా రక్తస్రావం అయిందట.

senior ntr and jayaprada acted in super man

senior ntr and jayaprada acted in super man

Senior NTR – Jayaprada : షూటింగ్ లో కాలు జారి కింద పడ్డ జయప్రద

దీంతో షూటింగ్ ను కూడా ఆపేసి జయప్రదను ఒక కుర్చీలో కూర్చోబెట్టారట. అయితే.. ఇంతలో సడెన్ గా అక్కడ ప్రత్యక్షమైన ఎన్టీఆర్.. కొంచెం పసుపు, ఒక పాత గుడ్డను తీసుకొచ్చారట. ఇదిగో అమ్మాయి.. కాస్త చురుక్కు మంటుంది కానీ.. తర్వాత చల్లగా ఉంటుంది. ఏం టెన్షన్ పడకు.. అంటూ తన కాలికి పసుపు అద్ది గుడ్డను చుట్టారట. సీనియర్ ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో. ఇండస్ట్రీని ఏలుతున్నారు. కానీ.. హీరోయిన్ కు అలా జరిగిందనగానే.. తన స్థాయిని కూడా మరిచిపోయి జయప్రదకు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో.. జయప్రద వెంటనే ఎన్టీఆర్ కాళ్లమీద పడిపోయిందట.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది