senior ntr and jayaprada acted in super man
Senior NTR – Jayaprada : సీనియర్ ఎన్టీఆర్ సినీ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్ర సృష్టించారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో ఎక్కువగా శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి హీరోయిన్లు నటించారు. అయితే.. జయప్రదతో తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే అప్పట్లో ఎన్టీఆర్, జయప్రదది హిట్ పెయిర్ అనేవాళ్లు. ఎన్టీఆర్, జయప్రద ఒక హిట్ పెయిర్ కాగా, ఎన్టీఆర్, శ్రీదేవి మరో హిట్ పెయిర్. ఈ జంటల కాంబోలో సినిమా వస్తే.. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టే. ప్రేక్షకులకు పండుగే.
ఎన్టీఆర్, జయప్రద ఇద్దరూ కలిసి నటించిన సినిమాలలో పలు యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో సూపర్ మాన్ అనేది ఒక యాక్షన్ మూవీ. అది అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఓ ఘటన చోటు చేసుకుందట. దానికి సంబంధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ జరుగుతుండగా జయప్రద కాలు జారి కింద పడిందట. అప్పుడు ఎన్టీఆర్ కూడా పక్కనే ఉన్నారట. ఇద్దరితో కలిసి షూటింగ్ జరుగుతుండగా జయప్రద కాలు జారి కింద పడటంతో.. తన కాలు బొటనవేలుకు గాయం అయి తీవ్రంగా రక్తస్రావం అయిందట.
senior ntr and jayaprada acted in super man
దీంతో షూటింగ్ ను కూడా ఆపేసి జయప్రదను ఒక కుర్చీలో కూర్చోబెట్టారట. అయితే.. ఇంతలో సడెన్ గా అక్కడ ప్రత్యక్షమైన ఎన్టీఆర్.. కొంచెం పసుపు, ఒక పాత గుడ్డను తీసుకొచ్చారట. ఇదిగో అమ్మాయి.. కాస్త చురుక్కు మంటుంది కానీ.. తర్వాత చల్లగా ఉంటుంది. ఏం టెన్షన్ పడకు.. అంటూ తన కాలికి పసుపు అద్ది గుడ్డను చుట్టారట. సీనియర్ ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో. ఇండస్ట్రీని ఏలుతున్నారు. కానీ.. హీరోయిన్ కు అలా జరిగిందనగానే.. తన స్థాయిని కూడా మరిచిపోయి జయప్రదకు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో.. జయప్రద వెంటనే ఎన్టీఆర్ కాళ్లమీద పడిపోయిందట.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.