Jabardasth Naresh : గొలుసు ఇచ్చిన నరేష్, ముద్దు పెట్టిన షబీనా.. ముదిరిన వ్యవహారం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Naresh : గొలుసు ఇచ్చిన నరేష్, ముద్దు పెట్టిన షబీనా.. ముదిరిన వ్యవహారం

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రేమ కథలను నడిపించడం, తద్వారా టీఆర్పీ రేటింగ్‌లను రాబట్టడం అనేది కామన్ అయింది. రష్మీ సుధీర్ జోడిని అలానే సాగదీశారు. గత తొమ్మిదేళ్లుగా ఈ జోడి అలరిస్తూనే ఉంది. ఇంకా మున్ముందు కూడా చేస్తూనే ఉంటుంది.అయితే ఇప్పుడు కొత్త జంటలు కూడా వచ్చేశాయి. ఇంకా కొత్త కొత్త ట్రాకులు పుట్టుకొస్తున్నాయ్. అందులో నరేష్ షబినా ట్రాక్ ఒకటి. షబినా ఈ మధ్య జబర్దస్త్ షోలో రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిపోయింది. కస్తూరీ సీరియల్లో […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :9 February 2022,2:00 pm

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రేమ కథలను నడిపించడం, తద్వారా టీఆర్పీ రేటింగ్‌లను రాబట్టడం అనేది కామన్ అయింది. రష్మీ సుధీర్ జోడిని అలానే సాగదీశారు. గత తొమ్మిదేళ్లుగా ఈ జోడి అలరిస్తూనే ఉంది. ఇంకా మున్ముందు కూడా చేస్తూనే ఉంటుంది.అయితే ఇప్పుడు కొత్త జంటలు కూడా వచ్చేశాయి. ఇంకా కొత్త కొత్త ట్రాకులు పుట్టుకొస్తున్నాయ్. అందులో నరేష్ షబినా ట్రాక్ ఒకటి.

షబినా ఈ మధ్య జబర్దస్త్ షోలో రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిపోయింది. కస్తూరీ సీరియల్లో కనిపించే షబినా ఇప్పుడు జబర్దస్త్ నటిగా మారిపోయింది. ఒకప్పుడు కెవ్వు కార్తీక్ టీంలోనే ఉండేది. కార్తీక్ షబినా ట్రాక్ కొన్ని రోజులు నడిపించారు. కానీ మధ్యలో నరేష్ చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. షబినా మీద ఉన్న కోరికలను, ప్రేమలను డైలాగ్స్, స్కిట్స్ రూపంలో చూపించేవాడు.

Shabina K To Naresh In Extra Jabardasth

Shabina K To Naresh In Extra Jabardasth

Jabardasth Naresh : నరేష్‌కు షబినా ముద్దు..

ఇక రోజా కూడా ఈ ట్రాక్‌ను బాగానే ఎంకరేజ్ చేసింది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డేస్పెషల్‌గా మరింతగా రెచ్చగొట్టేసింది. ఏం గిఫ్ట్ ఇస్తావ్ అంటూ నరేష్‌ను అంత ఎత్తుకు లేపేసింది. దీంతో నరేష్ ఏకంగా తన మెడలోని గొలుసుని తీసిచ్చాడు. తన తొడ మీద షబినాను కూర్చోబెట్టుకున్నాడు. మొత్తానికి షబినా కూడా ముద్దు పెట్టడంతో నరేష్ గాల్లోకి ఎగిరాడు. మొత్తానికి ఈ ఇద్దరి వ్యవహారం బాగానే ముదిరింది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది