Pallavi Prashanth : ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కనిపించే అంత మంచి వాడు కాదు.. వాళ్లు వాడుకొని వ‌దిలేశార‌న్న ష‌కీలా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pallavi Prashanth : ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కనిపించే అంత మంచి వాడు కాదు.. వాళ్లు వాడుకొని వ‌దిలేశార‌న్న ష‌కీలా

Pallavi Prashanth : బీ గ్రేడ్ చిత్రాల‌తో ఫుల్ ఫేమ‌స్ అయి స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది ష‌కీలా. ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. అప్ప‌ట్లో ఆమె సినిమాలు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోయేవి. అయితే తాను బీ గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే.. అప్పుడు నేను ఎవరికోసమైతే అంతగా కష్టపడ్డానో.. అంత సంపాదించానో వాళ్లు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Pallavi Prashanth : ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కనిపించే అంత మంచి వాడు కాదు.. వాళ్లు వాడుకొని వ‌దిలేశార‌న్న ష‌కీలా

Pallavi Prashanth : బీ గ్రేడ్ చిత్రాల‌తో ఫుల్ ఫేమ‌స్ అయి స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది ష‌కీలా. ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. అప్ప‌ట్లో ఆమె సినిమాలు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దూసుకుపోయేవి. అయితే తాను బీ గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే.. అప్పుడు నేను ఎవరికోసమైతే అంతగా కష్టపడ్డానో.. అంత సంపాదించానో వాళ్లు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. కానీ ఇప్పుడు నేను తినడానికి లేని పరిస్థితిలో లేను.. కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అంటూ ష‌కీలా ఓ సంద‌ర్బంలో చెప్పుకొచ్చింది.

Pallavi Prashanth ఆయ‌న‌కే ఉప‌యోగం..

ఇక తాజా ఇంట‌ర్వ్యూలో ష‌కీలా బిగ్ బాస్ గురించి, గ‌త సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. సీజన్ 7 లో కామన్ మ్యాన్ కాటగిరీలో అడుగుపెట్టి… తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపడేసి టైటిల్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌పై మాత్రం ఓ రేంజ్‌లో విరుచుకుప‌డింది.హౌస్ లో నేను ఉన్నప్పుడు.. నాకు ప్రియాంక, అమర్ దీప్ , దామిని , సందీప్ మాత్రమే నిజాయితీ పరులుగా అనిపించారు.. వారిలో నాకు ఎలాంటి తప్పులు కనిపించలేదు.. ముఖ్యంగా వాళ్లలో నేను నిజాయితీ చూసాను.. శివాజీ అయితే న్యూట్రల్ పర్సన్… ఆయన నిజాయితీ. పరుడా కాదా అనేది నేను చెప్పను.. కానీ వీక్ గా అనిపించిన కంటెస్టెంట్స్ కి మాత్రం ఆయన కచ్చితంగా సపోర్ట్ చేశాడు.

Pallavi Prashanth ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కనిపించే అంత మంచి వాడు కాదు వాళ్లు వాడుకొని వ‌దిలేశార‌న్న ష‌కీలా

Pallavi Prashanth : ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కనిపించే అంత మంచి వాడు కాదు.. వాళ్లు వాడుకొని వ‌దిలేశార‌న్న ష‌కీలా

ఇక ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ నన్ను ఏం చేసిన ఐ డోంట్ కేర్.. కాకపోతే అతడు హౌస్ లోకి పిల్లి లాగా వచ్చి.. వినయంగా నటించాడు.. ఆ తర్వాత కాస్త గుర్తింపు రాగానే తన ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నది కూడా చూడకుండా… కళ్ళు నెత్తికెక్కాయి . యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది.. సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుంటూ ఆటిట్యూడ్ చూపించాడు ..అది నాకు నచ్చలేదు.. అది అతడి నిజస్వరూపం అంటూ తెలిపింది.. తనని మాత్రం బిగ్ బాస్ లోకి కేవలం పబ్లిసిటీ కోసమే తీసుకున్నారు, వాళ్ళ అవసరం తీరిపోయాక నన్ను పంపించేశారు. అంతే జరిగింది అని షకీలా తెలిపారు. బిగ్ బాస్ వల్ల నాకు ఏదో ఒరుగుతుంది అని నేను రాలేదు. పేమెంట్ ఇచ్చారు వచ్చాను. బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి తప్ప ఎవరికి ఉప‌యోగం లేదు. ఎందుకంటే స్టూడియో ఆయనదే, హోస్ట్ ఆయనే.. కాబట్టి ఆయనకి మాత్రమే లాభం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది