Shakuntalam bad news to Samantha
Samantha : శాకుంతలం సినిమాతో స్టార్ హీరోయిన్ సమంతకు షాక్ తగలబోతుందా అంటే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. ప్రఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ సమంత నుంచి ఇప్పటి వరకు సినిమా రాలేదు. అయితే, హిందీలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ 2తో మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇందులో పోషించిన రాజీ పాత్ర ఆమెకు మంచి క్రేజ్ తెచ్చింది. అయితే, విడాకుల తర్వాత సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిటవుతోంది. ఇప్పటికే తమిళంలో రూపొందిన మల్టీస్టారర్ కాథు వాక్కుల రెండు కాదల్ వచ్చి ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు ఆమె యశోద సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయింది. ఆగస్టులో రిలీజ్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే, అధికారికంగా నూ ఈ సినిమా గురించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. కానీ, దీనికి ముందే రిలీజ్ అవుతుందనుకున్న పౌరాణిక చిత్రం శాకుంతలం మాత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లోనే ఉంది. షూటింగ్, డబ్బింగ్ సమంత ఎప్పుడో కంప్లీట్ చేసేసింది. కానీ, ఇప్పటి వరకు ఆశించిన అప్‌డేట్ మాత్రం మేకర్స్ ఇవ్వలేదు.ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సంబంధించిన వీఎఫెక్స్ వర్క్ జరుపుకుంటోంది. సమ్మర్‌లో రిలీజ్ అనుకున్న ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న అగ్ర నిర్మాత దిల్ రాజు అవుట్‌పుట్ చూసి అంత సంతృప్తి చెందలేదని తెలుస్తుంది.
Shakuntalam bad news to Samantha
అంతేకాదు, సమంత కూడా దీనిపై అంత శాటిసైఫైగా ఫీలవలేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా ఇదే టాక్ ఆ మధ్య సమంత బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే వచ్చింది. సమంత మరీ సన్నగా కనిపిస్తుందని..క్యారెక్టర్‌కు ఆమె అంతగా సూటైనట్టు లేదని కామెంట్స్ వినిపించాయి. మరి ఈ సినిమా విషయంలో సమంతకు షాక్ తగులుతుందేమో చూడాలి. కాగా, సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాలలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. అలాగే, తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన ఓ సినిమా కమిటైనట్టు సమాచారం. అలాగే, హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా వచ్చే న్ల నుంచి మొదలవబోతోంది. ఇందులో ఆమె లెస్బియన్ పాత్రలో కనిపించబోతోంది.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.