Samantha : సమంతకు షాక్ తగలబోతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంతకు షాక్ తగలబోతుందా..?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 June 2022,1:00 pm

Samantha : శాకుంతలం సినిమాతో స్టార్ హీరోయిన్ సమంతకు షాక్ తగలబోతుందా అంటే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. ప్రఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ సమంత నుంచి ఇప్పటి వరకు సినిమా రాలేదు. అయితే, హిందీలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మేన్ 2తో మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇందులో పోషించిన రాజీ పాత్ర ఆమెకు మంచి క్రేజ్ తెచ్చింది. అయితే, విడాకుల తర్వాత సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిటవుతోంది. ఇప్పటికే తమిళంలో రూపొందిన మల్టీస్టారర్ కాథు వాక్కుల రెండు కాదల్ వచ్చి ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పుడు ఆమె యశోద సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ 80 శాతం కంప్లీట్ అయింది. ఆగస్టులో రిలీజ్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే, అధికారికంగా నూ ఈ సినిమా గురించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. కానీ, దీనికి ముందే రిలీజ్ అవుతుందనుకున్న పౌరాణిక చిత్రం శాకుంతలం మాత్రం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లోనే ఉంది. షూటింగ్, డబ్బింగ్ సమంత ఎప్పుడో కంప్లీట్ చేసేసింది. కానీ, ఇప్పటి వరకు ఆశించిన అప్‌డేట్ మాత్రం మేకర్స్ ఇవ్వలేదు.ప్రస్తుతం శాకుంతలం సినిమాకు సంబంధించిన వీఎఫెక్స్ వర్క్ జరుపుకుంటోంది. సమ్మర్‌లో రిలీజ్ అనుకున్న ఈ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న అగ్ర నిర్మాత దిల్ రాజు అవుట్‌పుట్ చూసి అంత సంతృప్తి చెందలేదని తెలుస్తుంది.

Shakuntalam bad news to Samantha

Shakuntalam bad news to Samantha

Samantha : క్యారెక్టర్‌కు ఆమె అంతగా సూటైనట్టు లేదని కామెంట్స్ వినిపించాయి.

అంతేకాదు, సమంత కూడా దీనిపై అంత శాటిసైఫైగా ఫీలవలేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా ఇదే టాక్ ఆ మధ్య సమంత బర్త్ డే సందర్భంగా తన పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే వచ్చింది. సమంత మరీ సన్నగా కనిపిస్తుందని..క్యారెక్టర్‌కు ఆమె అంతగా సూటైనట్టు లేదని కామెంట్స్ వినిపించాయి. మరి ఈ సినిమా విషయంలో సమంతకు షాక్ తగులుతుందేమో చూడాలి. కాగా, సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాలలో సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. అలాగే, తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన ఓ సినిమా కమిటైనట్టు సమాచారం. అలాగే, హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా వచ్చే న్ల నుంచి మొదలవబోతోంది. ఇందులో ఆమె లెస్బియన్ పాత్రలో కనిపించబోతోంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది