Shankar : శంకర్ టాలీవుడ్‌లో ఇప్పటి వరకు స్ట్రైట్‌గా ఒక్క సినిమా చేయలేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి తో శంకర్ సినిమా ఉంటుందని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడని ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ సెట్ అవలేదు. ఆ తర్వాత మెగాస్టార్ సినిమాలకి దూరమయ్యాడు. దాదాపు పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరసగా యంగ్ డైరెక్టర్‌కి అవకాశాలిస్తూ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకున్నారు.
ఈ క్రమంలో మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాని పూర్తి చేశాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరొక హీరోగా నటిస్తుండటం విశేషం. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ని కలిసి ఎప్పుడెప్పుడు థియోటర్స్ లో చూస్తామా అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో చిరు – చరణ్ ల పోస్టర్ రిలీజై తారా స్థాయిలో అంచనాలను పెంచాయి. ఒకరకంగా ఆచార్య భారీ మల్టీస్టారర్ గానే రూపొందిస్తున్నాడు కొరటాల శివ.
అయితే ఊహించని విధంగా మెగా అభిమానుల కోరిక నెరవేరబోతోందని తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శంకర్ – చరణ్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమా నిర్మించబోతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఉందట. ఆ పాత్రకి మెగాస్టార్ అయితే అద్భుతంగా ఉంటుందని దిల్ రాజు – శంకర్ చరణ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో చరణ్ ..మెగా స్టార్‌కి విషయం చెప్పడంతో నిజంగా పాత్ర నేనే చేయాల్సింది అయితే ఖచ్చితంగా చేయడానికి రెడీ అన్నట్టు సమాచారం. చూడాలి మరి అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో. నిజంగా శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ నటించే ఎన్ని సంచనాలు సృష్ఠిస్తారో చెప్పడం చాలా కష్టం.
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
This website uses cookies.