మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. అలా ఈ ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉంటాయి. నాగ్ చిరు సోదరభావంతోనే ఉంటారు. అందుకే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్స్‌కు నాగ్ పిలిచిన వెంటనే చిరంజీవి గెస్ట్‌గా వస్తుంటాడు. అయితే ఈ మధ్య చిరు నాగ్ కలిసి ఉన్న ఓ ఫోటో ఒకటి వైరల్ అయింది. చిరు ఇంటి వంట గదిలో నాగ్ సందడి చేశాడు. వైల్డ్ డాగ్ ప్రీమియర్ సందర్భంగా నాగ్ టెన్షన్‌లో ఉన్న సందర్భంలో చిరు ఫోన్ చేశారట.
వైల్డ్ డాగ్ ప్రీమియర్ కోసం ఇంట్లో అందరూ వెళ్లిపోయారు. నేను ఒక్కడిని మాత్రమే ఒంటరిగా ఉన్నాను. ప్రతీ సినిమా ఇప్పుడు ఇలాంటి సందర్బం వస్తుంది. అలాంటి సమయంలోనే చిరంజీవి గారు ఎందుకో ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావ్ నాగ్.. ఈవినింగ్ ప్లాన్ ఏంటి? అని అన్నారు. ఏమీ లేదండి.. ప్రీమియర్ కదా? అందరూ వెళ్లిపోయారు.. ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను అని సమాధానం ఇచ్చాను. అయితే నా ఇంటికి రా.. రాజమండ్రి నుంచి ఇప్పుడే చేపలు తెప్పించాను అని అన్నారు.
ఆయన అలా పిలవడంతో వెంటనే వెళ్లిపోయాను. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. పాత సినిమాల గురించి ముచ్చట్లు పెట్టుకున్నాం.. హిట్లు ఫ్లాపుల గురించి మాట్లాడుకున్నాం.. ఆయన ఎంతో బాగా వంట చేశారు.. అదిరిపోయింది అంటూ చిరుపై నాగ్ తన ప్రేమనంతా ప్రకటించేశాడు. మొత్తానికి చిరు వంటకాన్ని నాగ్ టేస్ట్ చేసేశాడు. అసలే చిరు వంట వండటంలో చేయి తిరిగిన వాడు. చిరు వంటల నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే. చిరు దోశలు వేయడంలో స్పెషలిస్ట్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.