Home » Entertainment » Shankar Ramcharan Ar Rahman Combination Is Super Dilraju
Entertainment

Shankar : శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. కాంబినేషన్ అదిరిపోయింది దిల్ రాజు..!

Authored By
vamana sai
The Telugu News | Published on: February 14, 2021, 4:00 pm
Advertisement

Shankar : శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. ఈ కాంబినేషన్ అదిరిపోయింది అని ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని చెప్పుకుంటున్నారు. శంకర్ కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెల్సిందే. ఇక శంకర్ దర్శకత్వం వహించిన వాటిలో ఎక్కువ సినిమాలకి ఆస్కార్ వార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే డెఫినెట్ గా ఆడియో సూపర్ హిట్ అన్న టాక్ ఉంది. ఇక ఏ.ఆర్.రెహమాన్ కూడా శంకర్ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపించడమే కాదు తన సినిమా కోసం విపరీతంగానూ కష్టపడతాడు.

Advertisement

shankar-Ramcharan-AR Rahman combination is super Dilraju

కాగా రీసెంట్ గా శంకర్ రాం చరణ్ కాంబినేషన్ లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా శంకర్ – రాం చరణ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోబోతున్నారన్నది పెద్ద చర్చ సాగుతోంది. అందుకు కారణం శంకర్ మధ్య మధ్య లో హరీస్ జైరాజ్, అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేయడమే. ఇండియన్ 2 సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎన్నుకున్నాడు శంకర్.

Advertisement

Shankar : ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్సైయ్యారట కూడా.

అయితే ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయింది. కాగా శంకర్ .. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేయబోయే లేటెస్ట్ మూవీ కి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నాడన్న న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. మన టాలీవుడ్ అభిమానులైతే ఇప్పటికే ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్సైయ్యారట కూడా. అంతేకాదు నిర్మాత దిల్ రాజుకి అదే రిక్వెస్ట్ చేస్తున్నారని సమాచారం. నిజంగా శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. కాంబినేషన్ గనక సెట్ చేస్తే అదిరిపోయినట్టే దిల్ రాజు అంటున్నారట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి