Shankar : శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. కాంబినేషన్ అదిరిపోయింది దిల్ రాజు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shankar : శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. కాంబినేషన్ అదిరిపోయింది దిల్ రాజు..!

Shankar : శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. ఈ కాంబినేషన్ అదిరిపోయింది అని ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని చెప్పుకుంటున్నారు. శంకర్ కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెల్సిందే. ఇక శంకర్ దర్శకత్వం వహించిన వాటిలో ఎక్కువ సినిమాలకి ఆస్కార్ వార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే డెఫినెట్ గా ఆడియో సూపర్ హిట్ అన్న […]

 Authored By govind | The Telugu News | Updated on :14 February 2021,4:00 pm

Shankar : శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. ఈ కాంబినేషన్ అదిరిపోయింది అని ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని చెప్పుకుంటున్నారు. శంకర్ కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెల్సిందే. ఇక శంకర్ దర్శకత్వం వహించిన వాటిలో ఎక్కువ సినిమాలకి ఆస్కార్ వార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే డెఫినెట్ గా ఆడియో సూపర్ హిట్ అన్న టాక్ ఉంది. ఇక ఏ.ఆర్.రెహమాన్ కూడా శంకర్ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపించడమే కాదు తన సినిమా కోసం విపరీతంగానూ కష్టపడతాడు.

shankar Ramcharan AR Rahman combination is super Dilraju

shankar-Ramcharan-AR Rahman combination is super Dilraju

కాగా రీసెంట్ గా శంకర్ రాం చరణ్ కాంబినేషన్ లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా శంకర్ – రాం చరణ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోబోతున్నారన్నది పెద్ద చర్చ సాగుతోంది. అందుకు కారణం శంకర్ మధ్య మధ్య లో హరీస్ జైరాజ్, అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేయడమే. ఇండియన్ 2 సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని ఎన్నుకున్నాడు శంకర్.

Shankar : ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్సైయ్యారట కూడా.

అయితే ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయింది. కాగా శంకర్ .. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేయబోయే లేటెస్ట్ మూవీ కి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నాడన్న న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. మన టాలీవుడ్ అభిమానులైతే ఇప్పటికే ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్సైయ్యారట కూడా. అంతేకాదు నిర్మాత దిల్ రాజుకి అదే రిక్వెస్ట్ చేస్తున్నారని సమాచారం. నిజంగా శంకర్ – రాం చరణ్ – ఏ.ఆర్.రెహమాన్.. కాంబినేషన్ గనక సెట్ చేస్తే అదిరిపోయినట్టే దిల్ రాజు అంటున్నారట. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది