Game Changer Movie : రామ్ చరణ్ సోలో హీరోగా సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న విడుదల కాబోతుంది. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ director shankar దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగాయి. టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా సినిమా గ్రాఫ్‌ని పెంచారు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథ అందించిన నేపథ్యంలో శంకర్ గత చిత్రాలతో ఈ సినిమాకి పోలిక లేదు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల యూఎస్‌ఏలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.
కానీ ట్రైలర్ విడుదల చేయక పోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల విషయంలో వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 30న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించిందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శంకర్ మాట్లాడుతూ.. సినిమా ఫైనల్ పనులు జరుగుతున్నాయని.. మిక్సింగ్‌తో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపాడు. “పోకిరి, ఒక్కడు” లాంటి మాస్ మసాలా సినిమాలంటే ఇష్టం అని తెలిపాడు. అలాంటి మాస్ సినిమాలు తీయాలను అనుకున్నట్లు.. అలాంటి సినిమానే ‘గేమ్ చేంజర్’ అని తెలిపాడు. ఇప్పటివరకు తెలుగులో ఒక్క స్ట్రైట్ సినిమా కూడా చేయలేదు.
కానీ.. నా సినిమాలను మీరు బాగా ఆదరించారని మాట్లాడాడు. అంతేకాకుండా ఫస్ట్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నట్లు చెప్పాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదట. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని ప్రయత్నాలు జరిపానని, కానీ అది కూడా పట్టాలెక్కలేదని చెప్పాడు. ఇక కరోనా టైమ్‌లో ప్రభాస్‌తో ఒక కథ డిస్కషన్ కూడా జరిగిందట. కానీ తన తెలుగు స్ట్రేయిట్ సినిమా రామ్ చరణ్‌తోనే అవ్వాలని రాసిపెట్టి ఉందేమో అందుకే.. ‘గేమ్ చేంజర్’తో వస్తున్నాం అని చెప్పాడు. ఈ సినిమా స్టోరీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌కు, పొలిటీషియన్‌కు మధ్య జరిగే వార్ అని చెప్పాడు. రామ్ చరణ్ టెర్రిఫిక్‌గా పర్ఫార్మెన్స్ చేశాడని, రెండు పాత్రల్లో చాలా బాగా చేశాడని చెప్పాడు. మిగిలిన కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా మాట్లాడాడు. మొత్తానికి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాడు. game changer Movie pre release event
Rashmika Mandanna : పొట్టి నిక్కర్ లో నేషనల్ క్రష్ రష్మికా మందన్న అదరగొట్టేస్తుంది. 2025 కి వెల్కం చెప్పిన…
Ticket Price : న్యూ ఇయర్ వచ్చేసింది నెక్స్ట్ సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవుతుంది. ఐతే కొత్త ఏడాది అది…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan స్టైల్ కి ఐకాన్ గా ఉంటాడు. తను…
Record Liquor Sales : మొన్నటిదాకా తెలంగాణాలోనే Telangana Liquor మందుబాబులు ఎక్కువ అని అనుకున్నారు కానీ కొత్త మద్యం…
Rajamouli Mahesh : సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళి SS Rajamouli డైరెక్షన్ లో తెరకెక్కనుంది. త్వరలో…
Game Changer Movie Trailer : ఈ ఏడాది New Year సంక్రాంతికి Sankranti పలు సినిమాలు సందడి చేయనుండగా,…
Rythu Bharosa : తెలంగాణ Telangana ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తూ…
LPG Gas : దేశవ్యాప్త వ్యాపారులకు శుభవార్త. Indian Oil Gas ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు మార్కెటింగ్ కంపెనీలు…
This website uses cookies.