
Mana Shankara Vara Prasad Garu : సంక్రాంతి బరిలో ‘మన శంకరవరప్రసాద్ గారు’.. క్లైమాక్స్ లీక్‌తో పెరిగిన హైప్
Mana Shankara Varaprasad Garu : సంక్రాంతి పండుగకు తెలుగు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఒకటిగా నిలిచింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించడం ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సంపూర్ణ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో భారీ చర్చకు దారితీసింది.
చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా కేథరిన్ థ్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు టెక్నికల్‌గా కూడా బలమైన సపోర్ట్ ఉన్నట్టు ట్రైలర్లు, పాటలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కామెడీ, భావోద్వేగాలు, మాస్ మూమెంట్స్ అన్నింటినీ సమపాళ్లలో మేళవించి ప్రేక్షకులకు పండుగ విందు ఇవ్వాలనే లక్ష్యంతో సినిమాను తెరకెక్కించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి పాజిటివ్ బజ్‌ను తీసుకురావడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ఊపు కనిపిస్తోంది. చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తారని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Mana Shankara Vara Prasad Garu : సంక్రాంతి బరిలో ‘మన శంకరవరప్రసాద్ గారు’.. క్లైమాక్స్ లీక్‌తో పెరిగిన హైప్
ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు ముందే క్లైమాక్స్‌కు సంబంధించిన ఓ కీలక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథ ప్రకారం చివరి భాగంలో నయనతార పాత్రతో పాటు ఆమె కుటుంబాన్ని విలన్లు ప్రమాదంలోకి నెట్టుతారని వారిని కాపాడేందుకు చిరంజీవి రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. అయితే ఈ సీన్‌కు అదనపు హైప్ తెచ్చింది విక్టరీ వెంకటేశ్ స్పెషల్ ఎంట్రీ అనే టాక్. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తే థియేటర్లలో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరు–వెంకీ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ క్లైమాక్స్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే ఇది అధికారికంగా ప్రకటించని లీక్ కావడంతో నిజానిజాలు ప్రీమియర్ షోల తర్వాతే తేలనున్నాయి.
మరోవైపు ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బిజినెస్ అంశాలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో నిర్మాతలకు ఊరట లభించింది. ఈ నెల 11న జరిగే ప్రీమియర్ షోల కోసం ఒక్కో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించగా విడుదలైన తర్వాత వారం రోజుల పాటు కూడా అదనపు ధరలు వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50 వరకు, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారీ అంచనాలు క్లైమాక్స్ లీక్‌తో పెరిగిన ఉత్కంఠ టికెట్ రేట్ల పెంపు అన్ని కలిపి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుందో అన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
This website uses cookies.