Home » Entertainment » Shanmukh Deepthi Sunaina Breakup With Siri Trollings
Entertainment

Deepthi Sunaina Shanmukh : ష‌ణ్ముఖ్‌ దీప్తి సునయిన విడిపోవ‌డంతో సిరిపై ట్రోలింగ్.. నా వ‌ల‌న విడిపోలేదంటూ బ‌దులిచ్చిన శ్రీహాన్ ప్రేయ‌సి

Authored By
Sam C
The Telugu News | Published on: January 16, 2022, 7:40 am
Advertisement

Deepthi Sunaina Shanmukh : అరే ఏంట్రా ఇదీ.. బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు రాగానే కొత్త సంగ‌తులు చెప్పి అభిమానుల‌ని ఆనందింప‌జేస్తావు అనుకుంటే బ్యాడ్ న్యూస్ చెవిన ప‌డేలా చేశావు అంటూ ష‌ణ్ముఖ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 31న షణ్ముఖ్‌తో బ్రేకప్ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ని ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది దీప్తి. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. అతన గెలుపుకోసం ఎంతో కష్టపడింది దీప్తి. అతని కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆర్ధికంగానూ హెల్ప్ చేస్తూ సపోర్ట్‌గా నిలిచింది. అయితే ష‌ణ్ముఖ్‌.. దీప్తిని మ‌రచి సిరి మోజులో ప‌డ్డాడంటూ అందుకే దీప్తి అత‌డికి బ్రేక‌ప్ చెప్పిందంటూ జోరుగా ప్ర‌చారం సాగింది.

Advertisement

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక మాములుగానే ఉన్న సిరి ష‌ణ్ముఖ్ కొద్ది రోజుల త‌ర్వాత ఒకరంటే ఒకరు విడవ లేని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయారు. ఈ సమయంలో లోపలికి వచ్చిన సిరితల్లి మీరిలా హగ్గులు ఇచ్చుకోవడం బయటకు చూసేవాళ్ళకి ఏమాత్రం బాలేదని షణ్ముఖ్ జస్వంత్ ముఖం మీద చెప్పింది. ఆమె ఎందుకు చెప్పిందో తెలియదు కానీ ఆమె చెప్పిన తర్వాత సిరి హనుమంతు ఇంకా ఎక్కువగా ఇవ్వడం మొదలు పెట్టింది. వారిపై ఎంత దారుణ‌మైన ట్రోల్ జ‌రిగిందో కూడా మ‌నం చూశాం.

Shanmukh Deepthi Sunaina Breakup with Siri Trollings

Advertisement

Deepthi Sunaina Shanmukh : త‌నపై వ‌చ్చిన పుకార్ల‌కి స్పందించిన సిరి

ఈ పరిస్థితుల వ‌ల్ల‌నే దీప్తి..ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పింద‌ని చెబుతూ సిరిని తెగ ట్రోల్ చేశారు. తాజాగా సిరి మాట్లాడుతూ.. షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ తనకు మంచి స్నేహితులని ఇక వారిద్దరూ తనవల్ల విడిపోయారని అనడం సరికాదని ఆమె చెప్పుకొచ్చింది. వారి లవ్ కేవలం వంద రోజుల్లో విడిపోయేంత వీక్ కాదని తెలిపింది. సోషల్ మీడియాలో పుట్టించిన వాటిని తాను పుకార్లుగానే పరిగణిస్తా అని కూడా సిరి చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే షణ్ముఖ్‌ జశ్వంత్‌‌‌‌, దీప్తి సునయన మళ్ళీ కలుస్తారని, కానీ దానికి కొద్దిగా సమయం పడుతుందని ఇటీవ‌ల షణ్ముఖ్‌ తండ్రి చేసిన వ్యాఖ్యలు బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి