Shanmukh Jaswanth : దీప్తి అంతలా భయపెడుతుందా?.. పేరు చెప్పగానే వణికిపోయిన షన్ను

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 25, 2021, 6:20 pm

Shanmukh Jaswanth బిగ్ బాస్ ఇంట్లో షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్నుని నాగార్జున దారుణంగా ఆడేసుకుంటున్నాడు. అరేయ్ ఏంట్రా ఇది అంటూ షన్ను ఫేమస్ అయ్యాడు. ఆ డైలాగ్‌ ఎంతగా ఫేమస్ అయిందంటే.. ట్రోల్స్, మీమ్స్‌కు ఐకాన్‌లా మారింది. ఏకంగా అరేయ్ ఏంట్రా ఇది అనే యూట్యూబ్ చానెళ్లు కూడా వచ్చేశాయి. అలా షన్ను డైలాగ్‌ను షన్నుకే అప్పజెబుతున్నాడు నాగార్జున. ప్రతీ సారి అరేయ్ ఏంట్రా ఇది అంటూ పరువుతీసేస్తున్నాడు.

Shanmukh Jaswanth On Deepthi Sunaina

Shanmukh Jaswanth On Deepthi Sunaina

నిన్నటి ప్రియ ఎలిమినేట్ అయింది. పోతూ పోతూ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని షన్నుని ప్రియ అడిగింది. ఏమీ వద్దు, ఆ మాట అన్నావ్ కదా? ఆమెకు అర్థం అవుతుంది అని షన్ను అన్నాడు. కానీ నాగార్జున మధ్యలో పుల్ల వేసేందుకు ట్రై చేశాడు. ఆమెను మిస్ అవుతున్నాడనే ఫీలింగ్ నాకు ఎక్కడా కనిపించడం లేదు అని ఇరికించే ప్రయత్నం చేశాడు నాగార్జున. దీంతో షన్నుతో పాటు అందరూ నవ్వేశారు. లేదు సర్ మిస్ అవుతున్నాడు అక్కడక్కడా పేర్లు రాస్తున్నాడు అంటూ ప్రియ కవర్ చేసింది.

Shanmukh Jaswanth దీప్తి సునయపై షన్ను కామెంట్స్

Shanmukh Jaswanth On Deepthi Sunaina

Shanmukh Jaswanth On Deepthi Sunaina

బయటకు వెళ్లాక ఆమెకు చెప్పు అని ప్రియతో నాగార్జున అన్నాడు. అమ్మో వద్దు సర్ టార్చర్ బరించలేను అని షన్ను దండం పెట్టేశాడు. అంటే ఆమె అంత టార్చరా? అని నాగ్ మళ్లీ ఇరికించే ప్రయత్నం చేశాడు. నేను ఇంట్లో వాళ్లకి కూడా భయపడను కానీ ఆమెకు మాత్రం భయపడతాను సర్ అని షన్ను చెప్పేశాడు. అంటే దీప్తి సునయన అంటే మరీ అంతగా భయపడతాడా? లేదా తెరపై మాత్రమే అలా చెప్పాడా? నిజంగానే ఆమె అంటే వణికిపోతాడా?.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp