Shiva shankar master : దేశంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు, అధికారులు ఓ వైపు చెబుతున్నా ప్రజలు మాత్రం వారి మాటలను కేర్ చేయడం లేదు. ఫలితంగా దాని బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే ఏపీ గవర్నర్ విశ్వభూషన్ సైతం కరోనా బారిన పడ్డారు. తర్వాత సినీ నటుడు కమల్ హాసన్ కు సైతం కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్‌కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. ప్రస్తుతం ఆయన చావుతో పోరాడుతున్నాడనే చెప్పాలి. సుమారు 75 శాతం వరకు లంగ్స్‌కు ఇన్‌ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెబుతున్నారు.
శివశంకర్ మాస్టర్ పెద్ద కొడుకు సైతం కరోనా బారిన పడి ప్రస్తుతం అపస్మరక స్థితిలో ఉన్నారు. మాస్టర్ భార్య సైతం కరోనాతో హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. ఇంట్లో ఇలా పలువురు కొవిడ్ బారిన పడటంతో వారి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వీరి చికిత్స కోసం ప్రస్తుతం రూ.లక్షలు అవసరం ఉండటంలో వారు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. శివ శంకర్ మాస్టర్ దాదాపుగా 800పైగా మూవీస్‌కు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. మగధీర సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసి ధీర ధీర పాటుకు నేషనల్ అవార్డు సైతం దక్కింది.
ఇదిలా ఉండగా ఇతర దేశాల్లో కొత్తరకం వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశాల నుంచి ఎవరు వచ్చినా వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. ప్రజలు సైతం కంపల్సరీ జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది.
Kiran Abbavaram : తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం Kiran Abbavaram కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు…
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వివిధ రకాల ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన జీతం ఖాతాలను అందిస్తుంది.…
It Raids : సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.…
Chicken : ఈరోజుల్లో చికెన్ షాప్ కి Chicken వెళ్లి కొనుక్కొచ్చి కోవటం అనేది చాలా అరుదు అయిపోయింది. చాలామంది…
Zodiac Signs : నవగ్రహాలలో రాహువునీ నీడ గ్రహం లేదా ఛాయా గ్రహం అని కూడా అంటారు. Zodiac Signs…
Tea : చలికాలంలో అంటూ వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివి వస్తుంటాయి. చాతిలో…
FCI Recruitment 2025 : ఆహార సరఫరా మరియు పంపిణీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు FCI రిక్రూట్‌మెంట్ 2025 …
Zodiac Signs : 2025 సంవత్సరములో గ్రహాల యొక్క మార్పులు, వాటి యొక్క స్థితిగతులు, స్థాన చలనాలు గురించి తెలుసుకుందాం..…
This website uses cookies.