Samantha : విడాకుల త‌ర్వాత రెచ్చిపోతున్న స‌మంత‌… అలాంటి పాత్ర చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : విడాకుల త‌ర్వాత రెచ్చిపోతున్న స‌మంత‌… అలాంటి పాత్ర చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్..!

 Authored By bkalyan | The Telugu News | Updated on :26 November 2021,2:00 pm

Samantha : సమంత స్పీడు చూస్తుంటే అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు తమిళ, తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా కానుంది. ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్‌కు సమంత ఓకే చెప్పింది. ఆ ప్రాజెక్ట్ గురించి తాజాగా సమంతే ఓపెన్ అయింది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌తో హాలీవుడ్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా డైరెక్టర్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నాడట.

ఓ బేబీ నిర్మాత ఈ చిత్రాన్ని సునీత తాటి నిర్మిస్తోంది. బాఫ్టా అవార్డు సొంతం చేసుకున్న ఫిలిఫ్ జాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన ఇది వరకు డౌన్‌టన్ అబ్బే, ది గుడ్ కర్మ హాస్పిటల్ వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2004లో వచ్చిన అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారట.

samantha in arrangements of love movie

samantha in arrangements of love movie

Samantha : ఆ పాత్రలో సమంత..

ఇందులో సమంత అలాంటి పాత్ర నటిస్తుందట. తమిళ అమ్మాయి, సంప్రదాయబద్దంగా పెంచిన కుటుంబం, కానీ తన స్వతంత్ర ఆలోచనలతో పెరిగే అమ్మాయి పాత్రలో కనిపిస్తుందట. ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేయాలని ఒత్తిడి ఉంటుందట. కానీ సమంత పాత్ర మాత్రం తన సొంత ఆలోచనలతో జీవితాన్నిఎంచుకుంటుందట. ఈ పాత్ర ఎంతో చాలెంజింగ్ అని, ఇందులో నటించడం సవాల్‌తో కూడుకున్న పని అంటూ సమంత చెప్పుకొచ్చింది.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది