Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మూడో వారం కూడా పూర్తయింది. మూడో వారం సింగర్ దామిని ఇంటికి వెళ్లిపోయింది. మూడో వారంలో తను ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ.. అనూహ్యంగా తను ఎలిమినేట్ అయింది. చివరల్లో అమర్ దీప్, శుభశ్రీ, దామిని ఈ ముగ్గురే మిగిలారు. వీళ్లలో శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. శుభశ్రీని కాకుండా దామినిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. దామిని ఎలిమినేషన్ అస్సలు ఎవ్వరూ ఊహించకపోవడంతో ఒక్కసారిగా దామిని ఎలిమినేట్ అయిందని తెలియగానే ఇంటి సభ్యులు అందరూ ఏడ్చేశారు. ప్రియాంక అయితే చాలా సేపు ఏడ్చింది. తనతో నాకు కనెక్షన్ బాగుంది. అందుకే దామిని వెళ్లిపోతుంటే ప్రియాంక తట్టుకోలేకపోయింది.
ఇక.. ఎలిమినేట్ అయి స్టేజీ మీదికి వెళ్లి దామినికి తన జర్నీ చూపించి ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ల గురించి చెప్పాలని నాగార్జున అడగగా.. అందరిలో ఉన్న నెగిటివ్, పాజిటివ్ రెండు చెప్పింది దామిని. ఇంతలో శివాజీ వంతు రాగానే.. నేను సేఫ్ గేమ్ ఆడుతున్నా అని మీరు అనడం నేను నా ఏవీలో చూశాను. నేను ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడలేదు అని శివాజీతో అంటుంది దామిని. దీంతో నీ గేమ్ నువ్వు ఆడలేదు అంటాడు శివాజీ. ఫస్ట్ వీక్ మాత్రమే నీ గేమ్ నువ్వు ఆడావు. ఆ తర్వాత నీ గేమ్ నువ్వు ఆడలేదు. నా హృదయపూర్వకంగా చెబుతున్న. నాకు నీకు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగలేదు అంటాడు శివాజీ. మీ ఫ్రెండ్స్ ని అడుగు.. బయటికి వెళ్లిన తర్వాత.. నేను అన్నది తప్పు అయితే నేను వెనక్కి తీసుకుంటా అంటాడు శివాజీ.
ఆ తర్వాత మీరు కొందరికే ఫేవరిటిజం లాగా చూపిస్తారు. క్లియర్ గా తెలిసిపోతుంది. ఫలానా వారికి మీరు ఫేవరేట్ గా ఉంటారు.. అంటూ దామినీ చెప్పగా.. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా వర్కవుట్ అవ్వదు. నువ్వు ఇంటికి వెళ్లు. ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్లను అడుగు. నా అన్ని ఎపిసోడ్స్ చూడు. నా మాట నేను వెనక్కి తీసుకుంటా. క్షమాపణ కూడా చెబుతా అంటూ శివాజీ చెప్పడంతో హోస్ట్ నాగార్జున కూడా షాక్ అవుతాడు. దామిని కూడా ఇక ఏం మాట్లాడదు. మొత్తానికి మూడో వారానికి దామిని వెళ్లిపోగా.. ఇక హౌస్ లో ఉన్నది 11 మందే.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.