Bigg Boss Telugu 7 : నీ గేమ్ నువ్వు ఆడలేదు.. ఇప్పుడు వర్కవుట్ అవ్వదు.. ఎలిమినేట్ అయ్యావు కదా.. ఇంటికి వెళ్లిపో.. దామినిపై శివాజీ సీరియస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : నీ గేమ్ నువ్వు ఆడలేదు.. ఇప్పుడు వర్కవుట్ అవ్వదు.. ఎలిమినేట్ అయ్యావు కదా.. ఇంటికి వెళ్లిపో.. దామినిపై శివాజీ సీరియస్

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మూడో వారం కూడా పూర్తయింది. మూడో వారం సింగర్ దామిని ఇంటికి వెళ్లిపోయింది. మూడో వారంలో తను ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ.. అనూహ్యంగా తను ఎలిమినేట్ అయింది. చివరల్లో అమర్ దీప్, శుభశ్రీ, దామిని ఈ ముగ్గురే మిగిలారు. వీళ్లలో శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. శుభశ్రీని కాకుండా దామినిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 September 2023,12:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మూడో వారం కూడా పూర్తయింది. మూడో వారం సింగర్ దామిని ఇంటికి వెళ్లిపోయింది. మూడో వారంలో తను ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ.. అనూహ్యంగా తను ఎలిమినేట్ అయింది. చివరల్లో అమర్ దీప్, శుభశ్రీ, దామిని ఈ ముగ్గురే మిగిలారు. వీళ్లలో శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. శుభశ్రీని కాకుండా దామినిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. దామిని ఎలిమినేషన్ అస్సలు ఎవ్వరూ ఊహించకపోవడంతో ఒక్కసారిగా దామిని ఎలిమినేట్ అయిందని తెలియగానే ఇంటి సభ్యులు అందరూ ఏడ్చేశారు. ప్రియాంక అయితే చాలా సేపు ఏడ్చింది. తనతో నాకు కనెక్షన్ బాగుంది. అందుకే దామిని వెళ్లిపోతుంటే ప్రియాంక తట్టుకోలేకపోయింది.

shivaji and damini discussion after elimination in bigg boss telugu 7

#image_title

ఇక.. ఎలిమినేట్ అయి స్టేజీ మీదికి వెళ్లి దామినికి తన జర్నీ చూపించి ఆ తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ల గురించి చెప్పాలని నాగార్జున అడగగా.. అందరిలో ఉన్న నెగిటివ్, పాజిటివ్ రెండు చెప్పింది దామిని. ఇంతలో శివాజీ వంతు రాగానే.. నేను సేఫ్ గేమ్ ఆడుతున్నా అని మీరు అనడం నేను నా ఏవీలో చూశాను. నేను ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడలేదు అని శివాజీతో అంటుంది దామిని. దీంతో నీ గేమ్ నువ్వు ఆడలేదు అంటాడు శివాజీ. ఫస్ట్ వీక్ మాత్రమే నీ గేమ్ నువ్వు ఆడావు. ఆ తర్వాత నీ గేమ్ నువ్వు ఆడలేదు. నా హృదయపూర్వకంగా చెబుతున్న. నాకు నీకు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగలేదు అంటాడు శివాజీ. మీ ఫ్రెండ్స్ ని అడుగు.. బయటికి వెళ్లిన తర్వాత.. నేను అన్నది తప్పు అయితే నేను వెనక్కి తీసుకుంటా అంటాడు శివాజీ.

Bigg Boss Telugu 7 : ఇప్పుడు వర్కవుట్ కాదు.. ఇక వెళ్లిపో అన్న శివాజీ

ఆ తర్వాత మీరు కొందరికే ఫేవరిటిజం లాగా చూపిస్తారు. క్లియర్ గా తెలిసిపోతుంది. ఫలానా వారికి మీరు ఫేవరేట్ గా ఉంటారు.. అంటూ దామినీ చెప్పగా.. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా వర్కవుట్ అవ్వదు. నువ్వు ఇంటికి వెళ్లు. ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్లను అడుగు. నా అన్ని ఎపిసోడ్స్ చూడు. నా మాట నేను వెనక్కి తీసుకుంటా. క్షమాపణ కూడా చెబుతా అంటూ శివాజీ చెప్పడంతో హోస్ట్ నాగార్జున కూడా షాక్ అవుతాడు. దామిని కూడా ఇక ఏం మాట్లాడదు. మొత్తానికి మూడో వారానికి దామిని వెళ్లిపోగా.. ఇక హౌస్ లో ఉన్నది 11 మందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది