Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో పక్కాగా రెండు గ్రూపులు ఫామ్ అయ్యాయి. అందులో ఒకటి స్టార్ మా బ్యాచ్ కాగా.. మరొకటి శివాజీ బ్యాచ్. అయితే.. శివాజీ బ్యాచ్ చాలా చిన్నది. అందులో ఉండేది ముగ్గురు మాత్రమే. ఒకరు శివాజీ, ఇంకొకరు ప్రశాంత్.. మూడో వ్యక్తి యావర్. అంతే ఈ ముగ్గురు ఒక బ్యాచ్ అంతే. మిగిలిన వాళ్లంతా ఆ స్టార్ మా బ్యాచ్ లోనే కలిశారు. అందుకే.. శివాజీ ఇంటి సభ్యుడిగా అర్హుడా కాదా అని హోస్ట్ నాగార్జున అడిగితే.. ప్రిన్స్ యావర్, ప్రశాంత్ ఇద్దరు మాత్రమే అర్హుడు అని చేయి లేపగా.. ఇక మిగిలిన వాళ్లంతా ఆయన ఇంటి సభ్యుడిగా పనికిరాడు అని చేతులెత్తారు. అంటే శివాజీని స్టార్ మా బ్యాచ్ ఎంతలా టార్గెట్ చేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్టార్ మా బ్యాచ్ మొత్తానికి శివాజీని ఏం చేయాలో అది చేసేసింది. హౌస్ మెట్ గా ఉన్న వ్యక్తిని కంటెస్టెంట్ గా చేశారు.
స్టార్ మా బ్యాచ్ ఫస్ట్ వీక్ నుంచి అదే చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు శివాజీని నామినేట్ చేయాలా అని.. ఆ రోజు వచ్చేసింది. ఇప్పుడు శివాజీ కంటెస్టెంట్ మాత్రమే. ఇక నామినేషన్లలో శివాజీని టార్గెట్ చేస్తారు. ఖచ్చితంగా స్టార్ మా బ్యాచ్ మొత్తం నామినేట్ చేస్తుంది. అయితే.. నిన్నటి ఎపిసోడ్ లో శుభశ్రీ కూడా శివాజీని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఆరోజు టాస్క్ లో ఆయన మీది మీదికి వచ్చాడంటూ చెప్పుకొచ్చింది. కానీ.. అక్కడ శివాజీ తప్పు లేదని అందరూ ఒప్పుకున్నారు. మరోవైపు రతికకు, తేజకు బీభత్సమైన వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. సిగ్గుందా.. అంటూ ప్రశాంత్ ను అన్నేసి మాటలు అనడం కరెక్టేనా అంటూ నాగార్జున సీరియస్ అవుతాడు.
మరోవైపు గౌతమ్ పై ఫిజికల్ గా దాడి చేసిన తేజను.. నాగార్జున జైలుకు పంపించాడు. ఇంకోసారి అలా చేస్తే రెడ్ కార్డ్ ఇచ్చి ఇంటికి పంపించడమే అన్నంతగా సీరియస్ అయ్యాడు నాగ్. ఇక.. ఈ వారం ఎలిమినేషన్స్ చూసుకుంటే.. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రతిక, తేజ ఈ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు లేదా.. ఇద్దరు ఖచ్చితంగా ఈరోజు ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉంది. ఇవాళ సండే కాబట్టి. ఫన్ డే.. ఇవాళ నాగ్ అందరితో చాలా సరదాగా గడపబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేశాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.