Home » Entertainment » Shobas Wicked Plan Against Nirupam And Jwala In Karthika Deepam
Entertainment

Karthika Deepam : జ్వాలపై ప్రేమ్ సీరియస్.. దీంతో జ్వాల షాకింగ్ నిర్ణయం.. హిమకు వేరే సంబంధం చూసిన సౌందర్య

Authored By
Varun G
The Telugu News | Updated on: May 29, 2022, 10:46 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 30 మే 2022, ఎపిసోడ్ 1365 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీకు దండం పెడతాను బావ.. ఈ విషయం గురించి నన్ను ఎప్పుడూ అడగొద్దు అని ప్రేమ్ ను కోరుతుంది హిమ. కానీ.. ప్రేమ్ మాత్రం అస్సలు వినడు. ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి నువ్వు కాదన్నావు అంటే ఏంటి దాని అర్థం అంటాడు ప్రేమ్. దీంతో బావ ఇది నువ్వే అడుగుతున్నావా.. లేక వేరే వాళ్లు నీతో అడిగిస్తున్నారా? నన్ను ఏం అడగొద్దు. ఈ విషయంలో నేను ఇంకేం మాట్లాడలేను.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. మరోవైపు శాంతాబాయికి కొన్ని డబ్బులు ఇచ్చి ఒక ఏరియాలో ఇల్లు తీసుకొని అద్దెకు దిగమని చెబుతుంది. ఆ తర్వాత నేను ఏం చెబుతానో అది చేయి అని చెబుతుంది.

Advertisement

shoba’s wicked plan against nirupam and jwala in karthika deepam

మరి.. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు బాగానే ఉంది కదా అంటుంది శాంతాబాయి. దీంతో అప్పుడప్పుడు కోపం తెప్పిస్తావు. వయసులో పెద్ద దానివి. నేను చేసే ప్రతిదానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు సౌకర్యంగా లేదని ఖాళీ చేయమనడం లేదు. నా సౌకర్యం కోసం నేను నిన్ను ఈ పని చేయమంటున్నాను. ఏం చేయాలో నేను చెబుతాను. వెళ్లు. మిగిలిన వివరాలు తర్వాత చెబుతాను అంటుంది శోభ. దీంతో శాంతాబాయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మైడియర్ ఆటో జ్వాల.. ఇప్పుడు నేను వేసే అడుగు కలలో కూడా ఊహించి ఉండవు. నిరుపమ్ కు నీకు మధ్యలో అడ్డుగోడ నేను కడతాను అని అనుకుంటుంది శోభ.

Advertisement

Karthika Deepam : జ్వాలతో కలిసి కేఫ్ కు వెళ్లిన నిరుపమ్

ఈ హిమ ఇంకా రాలేదేంటి అని అనుకుంటాడు నిరుపమ్. జ్వాల, నిరుపమ్ ఇద్దరూ కేఫ్ కు వెళ్లాక.. అక్కడికి అప్పుడే హిమ వస్తుంది. వాళ్లను చూస్తుంది. వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్నారు. ఈ సమయంలో నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుంటుంది హిమ.

ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించాలి.. అని అనుకుంటుంది. ఎలాగైనా బావ మనసులో నుంచి నేను వెళ్లిపోయేలా చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇంతలో వాళ్ల దగ్గరికి వెళ్తుంది హిమ. హిమ ముందు జ్వాలతో క్లోజ్ గా మూవ్ అయితే హిమకు ఖచ్చితంగా కోపం వస్తుంది అని మనసులో అనుకుంటాడు నిరుపమ్.

Advertisement

ఎలాగైనా బావకు నీకు పెళ్లి చేపించే పూచీ నాది అని మనసులో అనుకుంటుంది. మరోవైపు ప్రేమ్ చాలా డిస్టర్బ్ గా ఉంటాడు. తనకు ఏం అర్థం కాదు. ఏం చేయాలో తెలియదు. హిమ మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలో అర్థం కాదు.

మరోవైపు హిమకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటారు ఆనందరావు, సౌందర్య. ఇంతలో హిమ రావడంతో నీకు వేరే సంబంధం చూస్తాం. పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని నిలదీస్తారు ఆనంద రావు, సౌందర్య. శౌర్య వచ్చినా రాకున్నా నీకు మాత్రం పెళ్లి చేస్తాం అంటారు.

నీ పెళ్లి గురించి ఇక నీకు చెప్పే పనే లేదు. ఒక అవకాశం ఇచ్చాం. మన పరువు తీసింది. ఎందుకు ఇలా చేశావంటే ఇంతవరకు సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు దానికి మనం చూసిన సంబంధం చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటుంది సౌందర్య.

నానమ్మ.. నేను ఎందుకు పెళ్లి వద్దంటున్నానో చెప్పలేను. మీరు అర్థం చేసుకోలేరు. ఇదంతా శౌర్య కోసం చేస్తున్నానని తెలుసుకున్నప్పుడు మీరు సంతోషిస్తారు అని మనసులో అనుకుంటుంది. నిరుపమ్ వాళ్లు ఊరుకున్నారు కానీ.. వేరే వాళ్లు అయితే పెద్ద పంచాయతీ పెట్టేవారు అంటుంది సౌందర్య.

Advertisement

మరోవైపు సత్యం ఇంటికి బాక్స్ తీసుకొని వస్తుంది జ్వాల. ప్రేమ్ ను చూసి ఎక్స్ ట్రా అంటుంది. దీంతో హలో తిక్క.. నువ్వు నాతో ఇప్పటి నుంచి మాట్లాడకు. నీకు, నాకు ఏ సంబంధం లేదు. వచ్చావా.. భోజనం తెచ్చావా.. డబ్బులు తీసుకున్నావా.. వెళ్లిపోయావా అన్నట్టుగానే ఉండాలి అని చెప్పి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి