
#image_title
Bigg Boss Telugu 7 : వామ్మో ఇవేం నామినేషన్స్ దేవుడా.. ఏ సీజన్ లో కూడా ఏ కంటెస్టెంట్లు కూడా ఇంతలా నామినేషన్స్ సమయంలో ఫైర్ కాలేదు. ప్రతి నామినేషన్ మామూలుగా లేదు. ఫైర్ అంటే ఫైర్.. ప్రతి కంటెస్టెంట్ ఈసారి చాలా సీరియస్ గా నామినేషన్స్ చేశారు. శివాజీ అమర్ దీప్, శివాజీ శోభా శెట్టి, భోలే శోభా శెట్టి, ప్రశాంత్ గౌతమ్, ప్రశాంత్ అమర్, యావర్ శోభా శెట్టి.. ఇలా ప్రతి ఒక్కరి మధ్య నామినేషన్స్ సమయంలో మాటల యుద్ధాలే చోటు చేసుకున్నాయి. ముందుగా శివాజీ.. భోలే విషయంలో జరిగినా దాన్ని తీసుకొని శోభా శెట్టి, ప్రియాంకను నామినేట్ చేయడంతో.. శోభా శెట్టి కూడా శివాజీని నామినేట్ చేసింది. అలా.. నామినేషన్స్ సమయంలో నువ్వంటే నువ్వు అంటూ కంటెస్టెంట్లు గొడవ పెట్టుకున్నారు. అయితే.. ఈ వారం నామినేషన్స్ పక్కాగా కరెక్ట్ గా ఎవరి మీద పడాలో వాళ్ల మీద పడ్డాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాని వాళ్లు కూడా ఈసారి నామినేషన్స్ లోకి వచ్చారు. అందులో ఒకరు సందీప్ మాస్టర్. ఆయన ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాలేదు. ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. ఆరుగురు వెళ్లిపోయారు. కానీ.. సందీప్ మాస్టర్ మాత్రం ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు.
ఇక.. ఈ వారం నామినేషన్స్ లోకి శోభా శెట్టి కూడా వచ్చింది. ఇదివరకు ఒకటి రెండు సార్లు మాత్రమే శోభా శెట్టి నామినేషన్స్ లోకి వచ్చింది కానీ.. సేవ్ అయింది. కానీ.. ఈసారి శోభా శెట్టి నామినేషన్స్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తనను నామినేట్ చేస్తాం. తన ఇరిటేషన్ చూడలేకపోతున్నాం. మోనిత కంటే దారుణంగా ప్రవర్తిస్తోంది. మా వల్ల కాదు.. శోభా శెట్టిని ఇంట్లో నుంచి పంపించేస్తాం అని ప్రేక్షకులు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి శోభా శెట్టి నామినేట్ అవడంతో ఇక ఈ వారం శోభాను ఖచ్చితంగా పంపించేస్తాం అని జనాలు ఫిక్స్ అయ్యారు. నిజానికి ఈ వారం మళ్లీ టార్గెట్ అయింది భోలే షావలే. ఆయనకు బాగానే ఓట్లు పడ్డాయి. నామినేషన్స్ సమయంలో మళ్లీ శోభా శెట్టి, భోలే మధ్య మాటల యుద్ధం నడిచింది. గత వారం కూడా డేంజర్ జోన్ లోనే భోలే ఉన్నాడు. కానీ.. ఆయన చేసే ఎంటర్ టైన్ మెంట్ కు చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయి ఆయనకు ఓటేశారు. అందుకే గత వారం హౌస్ లో అంత పెద్ద గొడవ జరిగినా భోలే సేవ్ అయ్యాడు. పూజా ఎలిమినేట్ అయింది. ఈ వారం కూడా శోభా శెట్టి కావాలని భోలేను బ్యాడ్ చేయడానికి తెగ ప్రయత్నించింది. ఈ వారం ఎలాగైనా ఆయన్ను బయటికి పంపించేయాలని ఫిక్స్ అయింది. ఒక్క శోభా శెట్టి మాత్రమే కాదు.. స్టార్ మా బ్యాచ్ మొత్తం భోలేను టార్గెట్ చేసింది.
శోభా, సందీప్ ఇద్దరూ ఈసారి నామినేషన్స్ లో ఉండటంతో ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా బయటికి పంపిస్తాం అంటున్నారు ప్రేక్షకులు. సందీప్ అయితే ఇప్పటి వరకు నామినేషన్స్ కు రాలేదు. అతడికి నామినేషన్స్ అంటే భయం. నామినేట్ అయితే ఎలిమినేట్ అవుతాడనే భయంతోనే నామినేషన్స్ లోకి రాలేదని స్పష్టం అవుతోంది. ఇక ఈ వారం సందీప్ ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉండాలని కొందరు కావాలని నామినేట్ చేశారు. ఈ వారం నామినేట్ అయిన వాళ్లు శోభ, భోలే, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్. వీళ్లలో ఖచ్చితంగా ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నది అయితే శోభ, సందీప్, భోలే అని చెప్పుకోవాలి. చూద్దాం మరి ప్రేక్షకులు ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉపముఖ్యమంత్రి, జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు…
Anil Ravipudi Next Film : టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం…
Sri Malika : పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత…
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన…
Tea habit చలికాలం వచ్చిందంటే చాలు..ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ టీ కప్పు చేతిలో ఉండాల్సిందే అనిపిస్తుంది చాలామందికి.…
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు మార్పులను స్వీకరిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తోంది. కొత్త హీరోలు, హీరోయిన్లు నిరంతరం వెండితెరపైకి వస్తున్నప్పటికీ…
Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…
This website uses cookies.