Categories: Entertainment

Intinti Gruhalakshmi 25 Oct Today Episode : హనీని తీసుకొని తులసి వెళ్లిపోతుందా? దివ్యను ఎవరు కిడ్నాప్ చేశారు.. దివ్యకు, హనీకి ఏంటి సంబంధం?

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 25 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 అక్టోబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1084 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజంగానే హనీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను అని తులసి చెబుతుంది. దీంతో పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు. ఇప్పుడు నా అవసరం హనీకి ఉంది. ఒంటరిగా వదిలిపెట్టలేను. అన్యాయం చేయలేను అంటుంది తులసి. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లడం, అనాథలను చేయడం అన్యాయం కాదా అంటాడు పరందామయ్య. దీంతో తులసికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మీరు అనాథలు ఎందుకు అవుతారు అత్తయ్య. మీకు తోడుగా మీ అబ్బాయి ఉన్నాడు కదా అంటుంది తులసి. హనీకి ఎవ్వరూ లేరు. తను అనాథ అంటుంది తులసి. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆవేశంలో, కోపంలో మాటా మాటా అనుకుంటాం. అంత మాత్రం చేత ఇలా ఇల్లు వదిలి వెళ్లిపోవడమేనా అంటుంది అనసూయ. సర్దిచెప్పాల్సిన నువ్వే ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఎలా తల్లి అంటుంది అనసూయ. మాట అనేవాళ్లు ఆవేశంతో అనేసి మరిచిపోవచ్చు.. వదిలివేయొచ్చు కానీ.. మాట పడ్డ వాళ్లు అంత త్వరగా మరిచిపోలేరు అత్తయ్య. అయినా నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు. మీ అబ్బాయి ఏదో అన్నారని బాధలో వెళ్లిపోవడం లేదు. కొద్ది క్షణాలు ప్రశాంతంగా ఆలోచించాను. మీరన్నట్టు మీ అబ్బాయి భయంలో కూడా నిజాయితీ, న్యాయం కనిపించాయి అంటుంది తులసి.

Advertisement

నా మొండితనం, నా నిర్ణయం వల్ల మీ అందరినీ బాధపెట్టడం తప్పు అనిపించింది అంటుంది తులసి. ఇంతలా అర్థం చేసుకున్న దానివి ఎందుకు అమ్మ వెళ్తున్నావు అంటే. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం తప్పు అనిపిస్తోంది అంటుంది. నా కొంగు ఇప్పటికీ కట్టుకొని తిరుగుతున్నప్పుడు దాని తాలుకు బాధను నేను అనుభవించాలి కానీ.. మిమ్మల్ని బాధపెట్టకూడదు అంటుంది తులసి. ప్రమాదానికి ఎదురు వెళ్లాలి అనుకుంటోంది, వెళ్తోంది నేను. అందుకు మీరెందుకు శిక్ష అనుభవించాలి. అందుకే మీకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను అంటుంది తులసి. తప్పుగా అనుకోకండి అంటుంది. హనీని తీసుకొని తులసి వెళ్లిపోతుండగా.. హనీ ఆపేస్తుంది. ఆంటీ నేనే వెళ్లిపోతా. తాతయ్యతో పాటే ఉంటాను. నాకోసం మీరు ఇల్లు వదిలి వెళ్లొద్దు అంటుంది హనీ. దీంతో చిన్నపిల్లవు అయినా పెద్ద మనసుతో ఆలోచించావు. ఇలాంటి మనసు దేవుడు అందరికీ ఇస్తే బాగుండు అంటుంది తులసి. ఇప్పుడు నీ చేయి నా చేతుల్లో ఉంది సరేనా అంటుంది తులసి. కుటుంబం అంటే కష్టాల్లో కూడా కలిసి ఉండాలి అని అన్నావు కదా. మరి ఇప్పుడు ఏమైందమ్మా అంటాడు పరందామయ్య. నా కష్టాలను నేనే పడతాను. సుఖాలను, సంతోషాలను మీకే వదిలిపెడుతున్నాను అంటుంది తులసి.

Advertisement

Intinti Gruhalakshmi 25 Oct Today Episode : నా పెద్దరికానికి విలువ లేదా తులసి అన్న పరందామయ్య

నామాటను అర్థం చేసుకుంటే కదా.. నా మాటకు విలువుంటే కదా.. పాతికేళ్ల అనుబంధం ఉన్న మనకన్నా.. ఈ ఇంటి కన్నా మరెవరో ముఖ్యం అని వెళ్లిపోతోంది. తనను ఇంకా ఏం ఆపుతాం అంటాడు నందు. అది కరెక్ట్ కాదు అంటుంది తులసి. నా ఫ్యామిలీ అంటే విలువ, ప్రేమ ఉన్నాయి కాబట్టే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాను అంటుంది తులసి. నా ఫ్యామిలీ క్షేమం కోసమే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నాను. నా ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తానో మీ అంతరాత్మకు తెలుసు. ఈ విషయంలో ఎవ్వరికీ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వను అంటుంది తులసి.

ప్రేమ, ఆపేక్ష మాకూ ఉన్నాయమ్మా. అందుకే ఈ బాధ అంటుంది అనసూయ. నీ గురించి మేము ఆలోచించడం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. నువ్వు గడప దాటి అడుగు బయట పెడితే మా ప్రాణాలు శరీరాలు దాటి పైకి చేరుకున్నట్టే అంటుంది అనసూయ. ఈ ఇంటికి పెద్దగా చెబుతున్నాను. హనీకి అండగా నిలబడాలనే నీ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. కష్టం, నష్టం ఏదైనా మేము కూడా అండగా ఉంటాం.. అంటాడు పరందామయ్య.

అంటే ఏంటి నాన్న.. నాకు మనసు లేదని అనుకుంటున్నారా? నేను ఆలోచించే నా ఫ్యామిలీలో అందులో తులసి కూడా ఉంది కదా. తులసి గురించి నేను కూడా టెన్షన్ పడుతున్నాను. అది మీకు అర్థం కావడం లేదా అని నందు అంటాడు. టెన్షన్ అంటే తులసి ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే చూస్తూ కూర్చోవడం కాదు అంటాడు పరందామయ్య. వాళ్లు మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటాడు నందు.

ఇంట్లో పెద్దగా నేను తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. తులసితో సహా. తులసి ఈ ఇంటిని వదిలి వెళ్లకూడదు. హనీతో ఈ ఇంట్లోనే ఉంటుంది అంటాడు పరందామయ్య. దీంతో మీరు తులసి తీసుకున్న నిర్ణయం కంటే.. చాలా ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు అంటాడు నందు. నేను ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నానో మీకు ఇప్పుడు అర్థం కాదు. మీకు నేను ఇప్పుడు శత్రువులా కనిపిస్తున్నాను. మీకు నచ్చినట్టు చేసుకోండి.. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను కానీ.. జరిగే నష్టానికి మీదే బాధ్యత. అది మాత్రం మరిచిపోకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.

ఆ తర్వాత మామయ్య ప్లీజ్.. నా నిర్ణయానికి కట్టుబడి ఉండండి అంటుంది తులసి. దీంతో అది నీ ఇష్టం. నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. నా పెద్దరికానికి విలువ లేదు అనుకుంటాను. ఇంకెప్పుడు ఈ విషయంలో నేను నోరు విప్పను అంటాడు పరందామయ్య. దీంతో తులసి.. బ్యాగు, హనీని తీసుకొని తిరిగి ఇంట్లోకి వెళ్లిపోతుంది.

మరోవైపు దివ్య, విక్రమ్.. జాను చేష్టలను చూసి ఏం చేయాలో అర్థం కాదు. జాను మాటలకు దివ్య చాలా బాధపడుతుంది. పరిస్థితి చేయి దాటిపోతోంది విక్రమ్. జాను డేంజర్ గేమ్ ఆడుతోంది. తను నష్టపోవడమే కాదు. మన జీవితాలతో కూడా ఆడుకుంటోంది. మనం ఎదురు తిరగకపోతే లాభం లేదు అంటుంది దివ్య.

దివ్య, విక్రమ్ ఏం చేస్తారో అని జాను తల్లిదండ్రులు టెన్షన్ పడతారు. మన ప్లాన్ వర్కవుట్ అయింది కానీ.. వాళ్లు ఏం ప్లాన్ వేస్తారో అంటారు. పచ్చబొట్టు ప్లాన్ నాది కాదు అత్తయ్యది అంటుంది జాను. జాను అంటే అత్తయ్య గారికి చాలా ఇష్టం. జాను చేసే ఏ పని అయినా ఆవిడ గుడ్డిగా సమర్థిస్తారు అంటుంది దివ్య.

జాను విషయంలో మొదటి నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు కానీ.. నేనే అంతగా పట్టించుకోలేదు అంటాడు విక్రమ్. ఈ సమస్యను శాశ్వతంగా ముగించాలి. మనం నిజాయితీగా ఉందాం. అలా అని జరిగే తప్పులను చూస్తూ మౌనంగా ఉండకూడదు అంటుంది దివ్య. మనకు మనమే అండగా నిలబడాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకూడదు అంటుంది దివ్య.

మరోవైపు నందుకు లాస్య కాల్ చేస్తుంది. ఇంట్లో వాళ్లు ఎలాగూ నిన్ను పట్టించుకోరు. ప్రేమగా మాట్లాడుతున్న నామీద అయినా చిరాకు పడకుండా మాట్లాడు. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది బంగారం. పూల రంగడిగా ఉండేవాడివి. తులసి నిన్ను ఆడిస్తోంది.. అంటుంది లాస్య. నేను నీ పక్కన ఉంటే నీకే సమర్థించేదాన్ని అంటుంది లాస్య.

డైరెక్ట్ గా రౌడీలు ఇంటి మీద పడ్డా నీకు భయంగా లేదా? తులసి అంటే మొండిది. ఈరోజు గండం గడిచింది కదా అని ప్రతిరోజు అలా జరగదు కదా అంటుంది లాస్య. హనీ గురించి నువ్వు మాట్లాడాలని అనుకుంటే.. వెంటనే కాల్ కట్ చేయి.. నాకు సంబంధం లేదు అంటాడు నందు.

హనీ విషయంలో ఎంతగా చెప్పినా మీరు నా మాట వినడం లేదు. ప్రమాదం తులసికి మాత్రమే కాదు.. మీ అందరికీ అంటుంది లాస్య. దీంతో తను మాట వినడం లేదు ఏం చేయమంటావు అంటాడు నందు. మరోవైపు దివ్యను కొందరు కిడ్నాప్ చేస్తారు. కారు డ్రైవర్ ను ఆపి మరీ.. అతడికి ఒక లెటర్ ఇచ్చి అతడిని బెదిరించి దివ్యను ఎత్తుకెళ్తారు. ఆ లెటర్ విక్రమ్ కి ఇస్తారు కారు డ్రైవర్. తులసి వస్తేనే దివ్యను విడిచిపెడతాం అని అందులో రాసిపెట్టి ఉంటుంది. ఆ లెటర్ ను తీసుకొని తులసి దగ్గరికి వెళ్తారు విక్రమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

29 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.