shobha shetty became crying star in bigg boss telugu 7
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో రెండు రోజులకే గ్రూపులు ఫామ్ అయ్యాయి. ఇప్పటికే మూడు నాలుగు గ్రూపులు ఫామ్ అయ్యాయి. అసలు రెండు మూడు రోజుల్లోనే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు స్టార్ట్ అవడం అనేది ఇదే తొలిసారి. అందుకే ఈ సీజన్ ను బిగ్ బాస్ ఉల్టా పుల్టా అన్నారు. తొలి నామినేషన్స్ కూడా చాలా వాడీవేడీగా సాగాయి. ఇప్పటికే ఫస్ట్ వీక్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఫస్ట్ వీక్ నామినేషన్లలో ఉన్న వాళ్లు వీళ్లే. శోభా శెట్టి, రతికా రోస్, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీలా, దామిని. 8 మందిలో ఒకరు ఇంటి నుంచి బయటికి వెళ్లబోతున్నారు.
అయితే.. వీళ్లలో ఎక్కువ ఓట్లు పడింది మాత్రం శోభా శెట్టి, రతికా రోస్, గౌతమ్ కృష్ణకు. మిగితా వాళ్లు ఒకటి రెండు ఓట్లతోనే నామినేషన్లలోకి వచ్చేశారు. ఇక.. గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ మధ్య గొడవ పెట్టాలని టేస్టీ తేజాకు రతిక టాస్క్ ఇస్తుంది. అది సీక్రెట్ టాస్క్. ఆ టాస్క్ లో భాగంగా గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ ఇద్దరికీ గొడవ పెడతాడు టేస్టీ తేజా. కానీ.. ఇద్దరి మధ్య గొడవ పెట్టింది టేస్టీ తేజానే అని తర్వాత వాళ్లకు తెలుస్తుంది. కానీ.. ఆ విషయం తెలియక ప్రిన్స్.. గౌతమ్ ను నామినేట్ చేస్తాడు. అంటే.. ఇక గౌతమ్ బకరా అయిపోయాడు.ఇక.. అత్యధికంగా నామినేషన్లు పడింది శోభా శెట్టికి. అయితే.. తనను ఎవరైనా నామినేట్ చేస్తే అస్సలు తీసుకోలేకపోయింది శోభా. చాలామంది తను కిచెన్ లో పని చేయలేదు. అందుకే నామినేట్ చేస్తున్నాం అంటూ చెప్పడంతో తాను పని చేశానని చెప్పుకోలేకపోయింది.
Bigg Boss Telugu 7 : గౌతమ్ కృష్ణను బకరాను చేసిన టేస్టీ తేజా.. ఏడుపు స్టార్ శోభా శెట్టి.. ప్రతి దానికీ అరిచి గోల పెట్టేస్తోంది
తాను పని చేస్తుంటే అందరూ చూసినా మళ్లీ ఇలాంటి తప్పుడు రీజన్లతో ఎందుకు నామినేట్ చేస్తున్నారని ఫైర్ అయింది. దామిని అయితే తను తిన్న ప్లేట్ కూడా కడగలేదు అనే చిన్న రీజన్ తో నామినేట్ చేయడంతో శోభా శెట్టి తనపై ఫైర్ అయింది. అలా.. చాలామందిపై ఫైర్ అయింది శోభాశెట్టి. గౌతమ్ తోనూ అదే గొడవ. గౌతమ్ ని శోభాశెట్టి నామినేట్ చేయడంతో.. శోభాశెట్టిని గౌతమ్ నామినేట్ చేశాడు. చెల్లుకు చెల్లు అన్నట్టుగా ఇద్దరి మధ్య వార్ మాత్రం మామూలుగా లేదు.
ఇక.. ఎవరైనా తనను నామినేట్ చేస్తే నిప్పులు చెరగడం, వాళ్లను ఎందుకు నామినేట్ చేశావు.. అదొక రీజనా అంటూ వాళ్లపై సీరియస్ అవడం, ఒక్కసారిగా ఎమోషనల్ అవడం అన్నీ చేసేస్తోంది శోభా శెట్టి. కెమెరాల ముందు వెళ్లి ఏడవడం కూడా చేసేస్తోంది. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఏడుపు స్టార్ గా శోభా శెట్టి ఫిక్స్ అయిపోయినట్టే అనిపిస్తోంది. చూద్దాం మున్ముందు ఇంకా హౌస్ లో ఏం జరుగుతుందో?
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.