Akhanda Sequel : అఖండ2లో సీనియర్ హీరోయిన్.. డిఫరెంట్ వేరియేషన్స్ కనిపించి సందడి..!
Akhanda Sequel : స్టార్ హీరోయిన్స్ గా ఒకప్పుడు నటించిన అందాల ముద్దుగుమ్మ శోభన Shobhana . ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. Nagarjuna నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోనే శోభన పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, గేమ్ లాంటి సినిమాలు చేసింది. తెలుగుతోపాటు Malayalam మలయాళ, Tamil తమిళ, Hindi హిందీ చిత్రాల్లో నటించింది Shobhana శోభన. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది. నేషనల్ వైడ్ గా శోభన ఎన్నో పర్ఫామెన్స్ లు చేసింది. కానీ శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.
Akhanda Sequel : అఖండ2లో సీనియర్ హీరోయిన్.. డిఫరెంట్ వేరియేషన్స్ కనిపించి సందడి..!
పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడు సినిమాలలోను ఆమె పెద్దగా కనిపించింది లేదు. ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కూడా ఈమె కీలకమైన పాత్రలోనే నటించింది. అప్పట్లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన శోభన ఈ మధ్యకాలంలో కథలు ఎంపిక విషయంలో ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది. బాలయ్య చిత్రానికి సంబంధించి డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పిన పాత్ర కూడా ఈమెకు బాగా నచ్చడంతో ఓకే చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. ఆమె పాత్ర ఓ సన్యాసిని అని తెలుస్తోంది. సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయట.
ఇందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. గతంలో Balakrishna బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాలని అందుకున్నాయి. ఇప్పుడు అఖండ 2 Akhanda 2 సినిమాపై కూడా భారీగానే అభిమానులకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.సినిమాలోని కొన్ని సన్నివేశాలను మహా కుంభమేళాలో షూట్ చేశారని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు.మా ప్రయత్న లోపం లేకుండా అఖండ సీక్వెల్ ను అద్భుతంగా తెరకెక్కించడానికి మా వంతు ప్రయత్నిస్తున్నామని బోయపాటి శ్రీను వెల్లడించారు.అఖండ2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.