Daaku Maharaaj Movie Review : డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
ప్రధానాంశాలు:
Daaku Maharaaj Movie Review : డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Daaku Maharaaj Movie Review : నందమూరి బాలకృష్ణ Balakrishna ఈమధ్య సూపర్ ఫాం లో ఉన్నారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుస హిట్లు అందుకుంటున్నాయి. బాలయ్య బాబు సినిమా వస్తుంది అంటే పక్కా హిట్ అనేలా టాక్ వచ్చింది. హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ బాబీ Babi డైరెక్షన్ లో డాకు మహారాజ్ గా వస్తున్నాడు.బాలయ్యతో సినిమా ఎలా తీస్తే ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి రీచ్ అవుతుందో ఆ లెక్కలు సరిగా వేసుకుని బాబీ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో తన మార్క్ యాక్షన్ సీన్స్ అదరగొట్టినట్టు ఉన్నాడు. డాకు మహారాజ్ కథ ఏంటి అన్నది ట్రైలర్ లో క్లియర్ గా తెలియట్లేదు కానీ బాలకృష్ణ మాస్ బీభత్సం ఉంటుందని తెలుస్తుంది.
Daaku Maharaaj Movie Review డాకు మహారాజ్ రివ్యూ
ఇక థమన్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ కాబోతుంది. సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యాలు నటన పరంగా ఊర్వశి రౌతెలా గ్లామర్ పరంగా అదరగొట్టబోతున్నారు. సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించారు. బాలకృష్ణ మార్క్ మాస్ తో పాటు బాబీ డైరెక్షన్ టాలెంట్ కూడా ఈ సినిమాలో పొందుపరిచారు. నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ కి అందరికీ సినిమా ఫుల్ మీల్స్ అందిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా బాలయ్య ఎనర్జీని పర్ఫెక్ట్ గా డైరెక్టర్ బాబీ వాడుకున్నట్టు అర్ధమవుతుంది. థమన్ బిజిఎం కూడా సినిమాకు మరో అసెట్ గ నిలిచేలా ఉన్నాయి…
నటీనటులు : నందమూరి బాలకృష్ణ్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల, ప్రగ్య జైస్వాల్, బాబీ డియోల్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
దర్శకత్వం : కె.ఎస్ బాబీ
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
డాకు మహారాజ్ పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే ప్రచార చిత్రాలు అదిరిపోయాయి. సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూ మరికొద్ది క్షణాల్లో మీకు అందిస్తాం. Balakrishna, Daaku Maharaaj Movie Review , Daku Maharaj Review , Daaku Maharaaj Review
Daaku Maharaaj Movie Review కథ
ఇంజనీర్ సీతారాం (బాలకృష్ణ) ఫ్యామిలీతో ప్రశాంతమైన జీవితాని గడుపుతుంటాడు. ఆ టైం లో ప్రజలు ఠాకూర్ నుంచి ఇబ్బందుకు పడుతున్నారని తెలిసి వారికి అండగా నిలుస్తాడు. మైనింగ్ కింగ్ (బాబీ డియోల్) సీతారాం ను ఇబ్బంది పెడతాడు. ఐతే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురిస్తూ సీతారాం తన అవతారాన్ని మార్చుకుంతాడు. అసలు డాకు మహారాజ్ గా సీతారాం ఎందుకు మారాడు.. ఇందులో నానాజీ పాత్ర ఏంటి..? డాకు మహారాజ్ తన లక్ష్యాన్ని సాధించాడా అన్నది సినిమా కథ.
Daaku Maharaaj Movie Review విశ్లేషణ
డాకు మహారాజ్ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. బాబీ ఏదైతే చెప్పాడో అదే తీశాడు. కథ కొత్తదేమి కాదు కానీ ట్రీట్ మెంట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణలోని మాస్ యాంగిల్ ని బాబీ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ఇప్పటిదాకా బాలయ్యని మాస్ హీరోగా బోయపాటి శ్రీను మాత్రమే బాగా చూపించారని అనుకున్నాం. కానీ డాకు మహారాజ్ చూశాక బాబీ తర్వాత బోయపాటి అంటారు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగ చేశాడు. సినిమా ఓపెనింగ్ ఇంటర్వల్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ 30 మినిట్స్ హై ఉంటుంది. ఐతే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కాస్త నిరుత్సాహ పరుస్తాయి. బాబీ అదొక్కటి బాగా రాసుకుని ఉంటే బాగుండేద్.ఇక సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుంది.
మరోసారి సంక్రాంతి విన్నర్ బాలకృష్ణ అనేలా డాకు మహారాజ్ ఉంది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. సినిమాలో ఇది ఎక్కువ అది తక్కువ అని కాకుండా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకెళ్లాడు.ఐతే సినిమాలో మైనస్ అంటే పూర్తిగా మాస్ ఎమోషనల్ మూవీగా వెల్తుంది. ఎంటర్టైనింగ్ అనేది యాక్షన్ మాత్రమే కామెడీ గురించి ఆలోచిస్తే కష్టమే. సంక్రాంతికి నందమూరి ఫ్యాన్స్ కి డాకు మహారాజ్ మాస్ ఫీస్ట్ అందించాడు.
Daaku Maharaaj Movie Review నటన & సాంకేతిక వర్గం
నందమూరి నట సింహం బాలకృష్ణ సీతారామ, నానాజీ, డాకు మహారాజ్ 3 గెటప్స్ తో అదరగొట్టారు. శ్రద్ధా, ప్రగ్యా, ఊర్వశి రౌతెలా కూడా మెప్పించారు. విలన్ గా బాబీ మంచి స్కోప్ దొరికింది. ఐతే బాలయ్య హీరోయిజం ముందు అది తేలిపోయింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ టీం చూస్తే విజయ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు హైలెట్ గా చెప్పుకునే దానిలో ఇది ఒకటి. థమన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ గా అనిపిస్తాయి. బాబీ డైరెక్షన్ అదిరిపోయింది.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ
బాబీ టేకింగ్
థమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
ప్రెడిక్టబుల్ స్టోరీ
బాటం లైన్ :
డాకు మహారాజ్.. మాస్ ఆడియన్స్ కి పండగే..!
రేటింగ్ : 3/5