Shraddha Das : ముద్దు అడిగిన శ్ర‌ద్ధా దాస్.. సుకుమార్ ఆమె కోరిక‌ని తీర్చ‌లేదుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: December 22, 2022, 8:20 pm

Shraddha Das : శ్ర‌ద్ధా దాస్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తూ ఉంటుంది శ్ర‌ద్ధా. ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో ఎంత డిమాండ్ ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందం, అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ ఈ అమ్మడికి అవకాశాలే పూర్తిగా అందడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే ఎక్కువ‌గా నమ్మకుంది. ఇటీవ‌ల‌ ఈమె వరుసగా వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతూ మ‌ధ్య మ‌ధ్య‌లో టీవీ షోస్ మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. సిద్దు ఫ్రమ్ సినిమాతో

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిణ శ్రద్ధా దాస్ .. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల‌కి పైగానే నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా కూడా ఇప్ప‌టికీ స‌రైన అవ‌కాశాలు రావ‌డం లేదు. దాదాపు 13 ఏళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్రేక్ దక్కక‌పోవ‌డంతో శ్ర‌ద్ధా అభిమానులు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. స్టార్ హీరోల చిత్రాలలో నటించినా, అవి భారీ విజయాలు సాధించినా.. ఆమె చేసిన పాత్రల రీత్యా పెద్ద‌గా అయితే గుర్తింపు రాలేదు. తెలుగులో మొదలైన ఆమె కెరీర్ దాదాపు అన్ని భాషల్లో కొనసాగింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించినా అక్క‌డ కూడా బ్రేక్ రాలేదు.

Shraddha Das forced to sukumar

Shraddha Das forced to sukumar

Shraddha Das : పాపం శ్ర‌ద్ధా..!

ఆర్య‌2 సినిమాలో శ్ర‌ద్ధా దాస్ శాంతి పాత్రలో న‌టించి మెప్పించింది. ఆ పాత్రలో శ్రద్ధాదాస్ తప్పిస్తే మిగతా ఏ హీరోయిన్ ఎవరు ఊహించ‌లేము అనేలా జీవించింది. అయితే ఆర్య 2 సినిమాలో బన్నీకి కాజ‌ల్ మ‌ధ్య లిప్‌లాక్ సీన్ ఉంద‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. కాజల్ అగర్వాల్ – బన్నీ లిఫ్ట్ లో వెళ్లే మూమెంట్లో ఓ ముద్దు సీన్ సుకుమార్ ప్లాన్ చేసిన‌ప్పుడు ఆ కిస్ సీన్ త‌న‌కు పెట్ట‌మ‌ని శ్రద్ధా దాస్‌ని కోరింద‌ట‌. చాలా సార్లు అడిగినా సరే సుకుమార్ సైలెంట్ గా సైడ్ అయ్యారే తప్పిస్తే శ్రద్ధ కోరికని ఏ మాత్రం తీర్చ‌లేద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న జ‌నాలు అయ్యో పాపం అంటున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp