Jabardasth Praveen : జబర్దస్త్ ప్రవీణ్ కోసం పాట పాడిన శ్రద్దా దాస్.. గోవాకు ట్రిప్ అడిగేశాడుగా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 19, 2022, 1:30 pm

Jabardasth Praveen : బుల్లితెరపై ఈ మధ్య కమెడియన్ ప్రవీణ్ బాగానే ఫేమస్ అవుతున్నాడు. పటాస్ షోలో కనిపించి, పటాస్ ప్రవీణ్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఫైమా లవర్‌గానూ ప్రవీణ్‌కు పేరుంది. ఈ ఇద్దరి ప్రేమ కథ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఫైమాకు కరోనా వచ్చిన సమయంలోనూ ప్రవీణ్ పక్కనే ఉన్నాడట. అన్ని సేవలూ చేశాడట. మొత్తానికి వీరి ప్రేమ కథ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఫైమాకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వదని ప్రవీణ్ చెబుతుంటాడు.అలా మొత్తానికి వీరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే.

అయితే ఆన్ స్క్రీన్ మీద మాత్రం ఎక్కువగా కలిసి కనిపించరు. ఫైమా చేసే స్కిట్లలో ప్రవీణ్ ఎక్కువగా కనిపించడు. అయినా కూడా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా కొన్ని షోల్లో ప్రవీణ్ తన మార్క్ వేస్తున్నాడు. తాజాగా ప్రవీణ్ కోసం శ్రద్దా దాస్ ఓ పాట పాడేసింది. మహేష్ బాబు క‌ృతి సనన్ కాంబోలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలోని గోవా సాంగ్‌ను పాడేసింది. ఓ గంట బీచుకెడదామా? ఓ గంట ఫిష్ పడదామా? అంటూ ఇలా ప్రవీణ్ కోసం పాట పాడేసింది శ్రద్దా దాస్.దీంతో ప్రవీణ్ గాల్లో తేలిపోయాడు. ఇక అంతటితో ఆగకుండా.. శ్రద్దా దాస్ దగ్గరకు వచ్చాడు ప్రవీణ్. ఆమెను స్టేజ్ మీదకు తీసుకెళ్లాడు.

Shraddha Das Sings Song For Jabardasth Praveen In Extra Jabardasth

Shraddha Das Sings Song For Jabardasth Praveen In Extra Jabardasth

ఆమెతో కలిసి స్టెప్పులు వేశాడు. ఇక అంతా అయిపోయిన తరువాత.. గోవాకు మనం ఎప్పుడు వెళ్దాం అంటూ అందరి ముందే అడిగేశాడు. దీంతో శ్రద్దా దాస్ ఒక్కసారిగా అవాక్కయింది. మొత్తానికి ప్రవీణ్ మాత్రం మామూలోడు. హీరోయిన్ తన కోసం పాట పాడటమే ఎక్కువ అనుకుంటే.. స్టేజ్ మీద రొమాంటిక్ స్టెప్పులు కూడా వేసింది. అంతటితో ఆగకుండా.. గోవా ట్రిప్ గురించి అడిగేశాడు.మొత్తానికి పూర్ణ స్థానంలో శ్రద్దా దాస్ వచ్చింది. జడ్జ్‌గా ఇంద్రజతో పాటు కనిపించింది. ఆమె పూర్తి స్థాయిలో వస్తుందా?లేదా ఇలా గెస్టుగా ఒకటి రెండు ఎపిసోడ్‌ల వరకే పరిమితమవుతుందా? అన్నది చూడాలి. మనో ఇకపై ఈ షోలో కనిపించకపోవచ్చనిపిస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp