Shriya Saran : శ్రీయ యవ్వారం మామూలుగా లేదుగా.. ఎప్పుడో తల్లై ఇప్పుడు రివీల్ చేసిన హాట్ హీరోయిన్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 12, 2021, 3:21 pm

Shriya Saran : ఇటీవలి కాలంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ చేస్తున్న హంగామా అంతా ఇంతా అని చెప్పగలమా? ఎక్కడ చూసిన హాట్ హాట్ సొగసులతో రెచ్చిపోతోంది ఈ బ్యూటీ. 2018 సంవత్సరంలో విదేశీయుడైన ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్లాడిన ఈ క్రేజీ బ్యూటీ, అప్పటినుంచి భర్తతో పబ్లిక్ రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచి ఇప్పుడు సడెన్ షాకిచ్చింది.

Shriya Saran Got Pregnant

Shriya Saran Got Pregnant

ఇంతకాలంగా దాచి పెట్టిన ఓ విషయాన్ని తాజాగా బయట పెట్టేసింది శ్రీయ. తాను తల్లి అయ్యాను అని చెప్పేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి నిన్నమొన్నటి దాకా భర్తతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ నాజూకు లుక్‌లో కనిపించిన శ్రీయ.. ఇంత సడెన్‌గా తల్లి ఎలా అవుతుందని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే తాను 2020 సంవత్సరంలోనే తల్లి అయ్యానని, కరోనా వ్యాప్తితో అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో ఉండగా.. తమ జీవితంలో మాత్రం ఓ అద్భుతం జరిగిందని శ్రీయ పేర్కొంది.

Shriya Saran : ఎప్పుడో తల్లైందా?

Shriya Saran Got Pregnant

Shriya Saran Got Pregnant

మరోవైపు ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌ కూడా శ్రీయ తల్లి అయిన విషయాన్ని రివీల్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో శ్రీయ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోలతో పాటు ప్రెజెంట్ బిడ్డతో ఆడుకుంటున్న వీడియో క్లిప్స్ జత చేశాడు. దీంతో ఈ బిడ్డ ఆండ్రీ కోస్చీవ్‌‌- శ్రీయ దంపతుల కూతురుకు వెల్‌కమ్ చెబుతూ శ్రీయకు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. మొత్తానికి శ్రీయ మాత్రం తన అభిమానులకు శుభవార్తను చెప్పినట్టైంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp