Shruthi Haasan : అనుకున్నదే జరిగింది.. ‘సలార్’లో ప్రభాస్ పక్కన ఆ హీరోయిన్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: February 2, 2021, 9:17 pm

Shruthi Haasan : ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ తాజాగా ఒకటి వచ్చింది. అయితే ఇది పేరుకే అప్డేట్. కానీ ఆ విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నదే. ప్రభాస్ సలార్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అంటూ గత వారం రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రభాస్ పక్కన ఈ సారి శ్రుతీ హాసన్ కనిపించబబోతోందని రూమర్లు వినిపించాయి. అయితే వాటిని కొందరు నమ్మారు. ఇంకొందరు నమ్మలేదు. ప్యాన్ ఇండియన్ సినిమా కదా. బాలీవుడ్ హీరోయిన్లనే తీసుకుంటారని కొందరు వాటిని కొట్టిపారేశారు.

Shruthi Haasan In Prabhas Salaar

Shruthi Haasan In Prabhas Salaar

కానీ చివరకు అదే జరిగింది. శ్రుతీ హాసన్ తమ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందన్న సలార్ నిర్మాణ సంస్థ హోంబళే ప్రకటించింది. తాజాగా తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. నేడు శ్రుతీ హాసన్ బర్త్ డే సందర్భంగా ఇలా అప్డేట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేయాలని అనుకున్నట్టున్నారు. మొత్తానికి ప్రభాస్, శ్రుతీ హాసన్ మొదటి సారిగా జోడిగా కనిపించబోతోన్నారు. ఇక ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడితో అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే సలార్ పనులు కూడా మొదలయ్యాయి. సింగరేణి గనుల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతోన్నాడట. ఈ మేరకు అన్నీ ప్రీ పొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సెట్ పనులు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్నాయట. అలా యాక్షన్ సీక్వెన్స్‌తో సలార్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. మొత్తాకి కేజీయఫ్ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ కూడా మొదటగా ఈ సినిమాకే డేట్లు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp