Home » Entertainment » Shruti Haasan As The Host Of Bigg Boss
Entertainment

Shruti Haasan : బిగ్ బాస్ కు హోస్ట్ గా శృతిహాస‌న్‌..!

Authored By
mallesh
The Telugu News | Published on: November 23, 2021, 1:20 pm
Advertisement

Shruti Haasan  తమిళంలో బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 5 సీజన్ కు అందాల భామ శృతి హసన్ రానుంది. అంటే కంటెస్టెంట్ గా కాదండోయ్. శృతి హాసన్ రాబోయేది హోస్ట్ గా. తమిళ బిగ్ బాస్ 5 సీజన్ కు హోస్ట్ గా కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన దాదాపు రెండు వారాల పాటు ఈ షోకు దూరం కానున్నారు. దాంతోనే బిగ్ బాస్ టీం కమల్ హాసన్ కు బదులుగా ఆయన తనయురాలు అయిన హీరోయిన్ శృతి హాసన్ ను రంగంలోకి దించాలని చూస్తోంది. ఇందుకు శృతి హాసన్ ఒప్పుకుంటుందా.. బిగ్ బాస్ టీమ్ ఆమెను ఎలా ఒప్పిస్తుందనే విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సే.

Advertisement

Shruti Haasan  బిజీ అవుతున్న ముద్దుగుమ్మ..

shruti haasan as the host of bigg boss

ముద్దు గుమ్మ శృతి హాసన్ ఇటీవలే తెలుగులో వకీల్ సాబ్, క్రాక్ వంటి సినిమాలను పూర్తి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో ఈ అమ్మడుకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్, కేజీఎఫ్ వంటి హిట్ చిత్రాన్ని అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాతో పాటుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కూడా ఒప్పుకుంది.

Advertisement

ఈ సినిమా పూజా కార్యక్రమాలను మొన్నీ మధ్యే పూర్తి చేసుకుంది. ఇలా శృతి హాసన్ చాలా బిజీగా మారుతుంది. ఇక ఈ సినిమాలే కాకుండా తమిళంలోనూ శృతి హాసన్ సినిమాలు చేస్తుంది. అంతే కాకుండా శృతి హాసన్ చాలా రంగాల్లో ఇప్పటికే తనను తాను నిరూపించుకుంది. ఈ రంగాల్లో కూడా శృతి హాసన్ బిజీగా ఉంటోంది. ఇప్పటికే బిజీగా ఉన్న ఈ భామకు ఇప్పుడు బిగ్ బాస్ 5 తమిళ సీజన్ ను హోస్ట్ చేసే అవకాశం దక్కింది. మరి శృతి హాసన్ బుల్లి తెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి