Shruti Haasan : కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ చూపు తిప్పుకోలేని అందంతో పాటు అద్భుతమైన నటనతో చాలా కాలంగా దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిస్తోంది. ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో ఉన్న శృతి హాసన్.. పర్సనల్ లైఫ్‌లోనూ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. 2000లో వచ్చిన ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది శృతి.
అనంతరం ‘లక్’ అనే హిందీ సినిమాలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో శృతి హాసన్ హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చేసింది.ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని ‘క్రాక్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘వకీల్ సాబ్’లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్’, బాలయ్యతో, చిరంజీవితో సినిమాలోనూ నటిస్తోంది. ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో లవ్ ట్రాక్ నడిపిన శృతి హాసన్ అతడికి బ్రేకప్ చెప్పి డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్ మొదలుపెట్టింది. తాజాగా శ్రుతీతో తన వివాహం క్రియేటివ్‌గా అయ్యిందని చెబుతున్నారు శాంతను.
ఈ విషయం గురించి ఓ ఇంగ్లీష్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంతను మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్‌గా మా (శ్రుతి, శంతను) పెళ్లి జరిగిపోయింది. అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం. మేమిద్దరం క్రియేటివ్ పీపుల్. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్ చేయాలనుకుంటాం.నా జీవితంలో శ్రుతీ ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే నన్ను చూసి తను ఇన్‌స్పైర్ అవుతుంటుంది. మా క్రియేటివ్ (సృజనాత్మకత) థాట్స్ కూడా ఒకేలా ఉంటాయి. ఇక ప్రత్యక్షంగా మా వివాహం ఎప్పుడు జరుగుతుంది? అనే విషయంపై మాత్రం నాకు క్లారిటీ లేదు’’ అన్నారు. మరి అతను శృతితో వైవాహిక జీవితం గడుపుతున్నట్టు చెప్పకనే చెప్పాడు. త్వరలో దీనికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ వస్తుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.