Shruti Haasan : శృతి హాస‌న్‌తో అలా పెళ్లి అయిపోయింద‌న్న ప్రియుడు

Authored By Sam C | The Telugu News | Published on: March 25, 2022, 3:30 pm

Shruti Haasan : క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ చూపు తిప్పుకోలేని అందంతో పాటు అద్భుతమైన నటనతో చాలా కాలంగా దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తనలోని టాలెంట్లతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిస్తోంది. ఈ మధ్య ఫుల్ ఫామ్‌తో ఉన్న శృతి హాసన్.. పర్సనల్‌ లైఫ్‌లోనూ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. 2000లో వచ్చిన ‘హే రామ్’ అనే చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది శృతి.

అనంతరం ‘లక్’ అనే హిందీ సినిమాలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో శృతి హాసన్ హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చేసింది.ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని ‘క్రాక్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ‘వకీల్ సాబ్’లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్‌’, బాలయ్యతో, చిరంజీవితో సినిమాలోనూ నటిస్తోంది. ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో లవ్ ట్రాక్ నడిపిన శృతి హాస‌న్ అతడికి బ్రేక‌ప్ చెప్పి డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్‌ మొదలుపెట్టింది. తాజాగా శ్రుతీతో తన వివాహం క్రియేటివ్‌గా అయ్యిందని చెబుతున్నారు శాంత‌ను.

Shruti Haasan boyfriend who is so married

Shruti Haasan boyfriend who is so married

Shruti Haasan : శృతి పెళ్లిపై క్లారిటీ..

ఈ విషయం గురించి ఓ ఇంగ్లీష్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంతను మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్‌గా మా (శ్రుతి, శంతను) పెళ్లి జరిగిపోయింది. అందుకు ఓ నిదర్శనం మా బలమైన బంధం. మేమిద్దరం క్రియేటివ్‌ పీపుల్‌. ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్‌ చేయాలనుకుంటాం.నా జీవితంలో శ్రుతీ ఎంతో స్ఫూర్తి నింపింది. అలాగే నన్ను చూసి తను ఇన్‌స్పైర్‌ అవుతుంటుంది. మా క్రియేటివ్‌ (సృజనాత్మకత) థాట్స్‌ కూడా ఒకేలా ఉంటాయి. ఇక ప్రత్యక్షంగా మా వివాహం ఎప్పుడు జరుగుతుంది? అనే విషయంపై మాత్రం నాకు క్లారిటీ లేదు’’ అన్నారు. మ‌రి అత‌ను శృతితో వైవాహిక జీవితం గ‌డుపుతున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పాడు. త్వ‌ర‌లో దీనికి సంబంధించి ఎలాంటి గుడ్ న్యూస్ వ‌స్తుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp