Shruti Haasan : స్టార్ హీరో కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు తనను తాను నిరూపించుకోవడం కోసం చాలా కష్టపడింది. కానీ.. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. తన తండ్రి సపోర్ట్ తీసుకోకుండా ఇండస్ట్రీలో రాణించాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా కష్టపడుతూ సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. చివరకు గబ్బర్ సింగ్ సినిమాతో తన రేంజ్ ఏంటో నిరూపించుకుంది. అప్పటి నుంచి తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయింది. చాలా ఏళ్ల పాటు శృతి హాసన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది.
ఆమె మల్టీ టాలెంటెడ్ అని కూడా అందరికీ తెలుసు. తను డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని ఎంట్రీ ఇవ్వలేదు. ముందు తను సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్ గా పరిచయం అయింది. ఆ తర్వాత.. రైటర్ గా, యాక్టర్ గా తన సత్తా చాటింది. ఇటీవలే సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాల్లో నటించి తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి శృతి హాసన్ వచ్చి సరిగ్గా 14 ఏళ్లు అవుతోంది. తన తొలి మూవీ హిందీలో లక్. ఆ సినిమా విడుదలై 14 ఏళ్లు అవుతోంది.
తను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సింగింగ్ గురించి అస్సలు ఎవ్వరితో చెప్పొద్దని అప్పట్లో ఇండస్ట్రీ వాళ్లు చెప్పేవారట. తను హీరోయిన్ కావాలని అనుకున్నప్పుడు సింగింగ్ ప్రస్తావన అస్సలు తీసుకురావద్దన్నారట. కానీ.. తను మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన సింగింగ్ కెరీర్ తో పాటు హీరోయిన్ గానూ ఇండస్ట్రీలో రాణించింది. ప్రస్తుతం శృతి హాసన్.. ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తన పర్సనల్ విషయానికి వస్తే.. తను శాంతను హజారిక అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. వీళ్ల పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అతడు ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.