Shruti Haasan : అందుకే శృతి హాసన్ ని మేకర్స్ వదలడం లేదా..?

Authored By vamana sai | The Telugu News | Published on: April 17, 2022, 7:30 pm

Shruti Haasan : పవన్ కళ్యాణ్ సరసన నటించిన కాటమరాయుడు సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ శృతి హాసన్ టాలీవుడ్‌లో కనిపించలేదు. ఆ మాటకొస్తే అటు తమిళ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసిందీ లేదు. అలా మూడేళ్ళు గడిపోయింది. ఈ లోపు రష్మిక మందన్న, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేశ్ లాంటి వారొచ్చి వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. దాంతో ఇక సినిమాలకు శృతి గుడ్‌బై చెప్పినట్టే అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ, అనూహ్యంగా రవితేజ సరసన నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకుంది.

ఈ సినిమా సక్సెస్ శృతిని మళ్ళీ క్షణం తీరిక లేకుండా చేసింది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కరువైన సీనియర్ హీరోలకు మంచి జోడీగా కుదురుతోంది. అందుకే, శృతి డేట్స్ కోసం మేకర్స్ బాగానే పోటీపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులోనే అమ్మడు ఎక్కువ సినిమాలు చేస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రభాస్ పక్కన శృతికి ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇందులో మంచి పవర్ ఫుల్ రోల్ చేస్తోంది. సలార్ గనక హిట్ అయితే, అమ్మడు పాన్ ఇండియన్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరినట్టే.

shruti haasan got many chances than other heroines

shruti haasan got many chances than other heroines

Shruti Haasan : ఇందులో హీరోయిన్ శృతి హాసన్ అంటే కాస్త నమ్మడం కష్టం..!

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154లో ఛాన్స్ అందుకుంది. చిరు పక్కన అవకాశం కూడా ఊహించనిదే. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఇక తనకి క్రాక్ సినిమాతో మళ్ళీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోంది. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరో. అసలు బాలయ్య పక్కన శృతిని హీరోయిన్‌గా తీసుకుంటారని ఎవరైనా భావిస్తారా. ఇది కూడా షాకిచ్చే అప్‌డేటే. ఇందులో హీరోయిన్ శృతి హాసన్ అంటే కాస్త నమ్మడం కష్టం అయింది కూడా. ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు శృతి సీనియర్ హీరోలకు మంచి ఛాయిస్‌గా మారింది.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp