
Silk smitha last letter sensational details
Silk Smitha : ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ గర్ల్ గా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది సిల్క్ స్మిత. అన్నిటికంటే ఎక్కువగా ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సాంగ్ లేని సినిమాలు ఆ కాలంలో లేవు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమె తన కళ్ళతోనే ప్రేక్షకులను మత్తులో ముంచింది. కళ్ళే ఆమెకు అందం, బలం అని చెప్పవచ్చు. అప్పట్లో ఏ హీరోయిన్ కి లేని క్రేజ్ సిల్క్ స్మిత కే సొంతం. అంత వైభోగం అనుభవించిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చిన్న వయసులోనే మృతి చెందింది. ఇక సిల్క్ స్మిత చనిపోవడానికి ముందు రాసిన లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు
is love failure the reason for Silk Smitha suicide
తనను మోసం చేసిన వారి గురించి తన ఆవేదనను లెటర్లో రాసింది. ఈ ఉత్తరం చదివిన వారికి కన్నీళ్లు రాకుండా ఉండవు. పాపం ఇన్ని కష్టాలను చవిచూసిందా అని అనిపించక మానదు. ఏడో ఏటనుంచి పొట్టకూటి కోసం ఎన్నో కష్టాలు పడ్డాను. నాది అంటూ ఏమీ లేదు. నాకోసం ఎవరూ లేరు నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నాకు ఎవరూ లేరు, తను ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. రాము, రాధాకృష్ణ నన్ను మోసం చేశారు. దేవుడు వారిని శిక్షిస్తాడు, ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తానని చెప్పి లైఫ్ లోకి వచ్చాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు. ప్రతి ఒక్కరు నా రెక్కల కష్టం తిన్నవాడే, బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు అని తన మనసులోని ఆవేదనను లెటర్ లో రాసింది. రోజు టార్చర్ అనుభవించాను, ఈ బాధ భరించలేకపోతున్నాను
Silk smitha last letter sensational details
దేవుడనే వాడుంటే నన్ను మోసం చేసిన వారిని శిక్షిస్తాడు అని రాసుకొచ్చింది. అయితే ఈ లేఖలో ఎక్కడా సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పలేదు. ఇక రాధాకృష్ణ అనే వ్యక్తి సిల్క్ స్మిత సెక్రటరీ. ఆమె చనిపోయిన తర్వాత పోలీసులు అతడిని విచారించారు. అయితే ఈ కేసులో ఎవరిని దోషులుగా తీర్చలేదు. సౌత్ లో అగ్రతారగా ఎదిగిన ఆమె అంత్యక్రియలు అత్యంత దారుణంగా జరిగాయి. ఒక అనాధ శవంలా అయినవారు, పరిశ్రమ ప్రముఖులు ఎవరు లేకుండానే సాగనంపారు. అయితే హీరో అర్జున్ మాత్రం భౌతిక కాయాన్ని చూడడానికి వెళ్ళాడట. అర్జున్, సిల్క్ స్మిత ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అందుకే ఆమెను కడసారి చూడడానికి తాను మాత్రమే వచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత సిల్క్ స్మిత రాసిన ఆఖరి ఉత్తరం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.