Singer Mangli marriage news
Singer Mangli : తన పాటలతో ఎంతో మందిని ఆకట్టుకున్న సింగర్ మంగ్లీ పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. చిన్న గ్రామం నుంచి వచ్చి పెద్ద సింగర్ అవ్వడం మామూలు విషయం కాదు. ఈమె మొదట్లో v6 లో మాటకారి మంగ్లీ షోతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలా తన మాటలతో బోనాలు, శివుడి, జానపద పాటలు పాడింది. అలాగే బతుకమ్మ పాటలు కూడా పాడారు. మొదటిగా మంగ్లీ శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో పాట పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు సినిమాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా మంగ్లీ రెండు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
లంబాడి సామాజిక వర్గానికి చెందిన గాయని మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లమా పూర్తి చేశారు. ఆ తర్వాత యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించారు. మ్యూజిక్ పై ఆసక్తి ఉండడంతో సింగర్ గా మారారు. జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆల్బమ్స్ రూపొందించారు. అలాగే పండుగల సమయాలలో మంగ్లీ పాడిన పాటలు గ్రామ గ్రామాన వినిపిస్తుంటాయి. ఈ ఆల్బమ్స్ ఆమెను వెండితెరకు పరిచయం చేశాయి. ప్లే బ్యాక్ సింగర్ గా స్థిరపడ్డారు.
Singer Mangli marriage news
అయితే తాజాగా మంగ్లి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకోబోయేది తమ బంధువుల అబ్బాయిని అని తెలుస్తుంది. వరుసకు బావ అయ్యే వ్యక్తిని సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకోబోతుందట . ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెళ్లి పీటలు ఎక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సైన్ చేసిన ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఎలాగో ఇది పెళ్లి వయసే కాబట్టి మంగ్లీ కచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.