Sid Sriram : ఏంటీ.. ఒక్క పాటకు సిద్ శ్రీ రామ్ కు అన్ని లక్షలా.. వామ్మో!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 7 December 2021, 7:15 am

Sid Sriram : సిద్ శ్రీరామ్.. తెలుగు గాయకుల్లో ఓ సంచలనం. అనతికాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న సింగర్. సాధారణంగా ఏ గాయకులకు అయినా అంత క్రేజ్ ఉండదు. ఒక ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఒక యేసుదాస్, ఒక ఏఆర్ రెహమాన్ వంటి మేల్ సింగర్ లకు ఉన్నంత అభిమానులు ఇటీవల కాలంలో సిద్ కి తప్ప ఏ గాయకుడికి లేరనే చెప్పాలి. సాధారణ గాయకుడిగా సైలంట్ గా వచ్చిన సిద్… ఎవరూ ఊహించని విధంగా దూసుకెళ్లి కోట్లాది మంది శ్రోతలను గెలుచుకున్నాడు. అయితే సిద్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.యువతలో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ పాపులర్ సింగర్ కు ఒక్క పాటకు ఎంత పుచ్చుకుంటున్నాడు అనే సందేహం చాలా రోజుల నుంచి ఆయన అభిమానులను వెంటాడుతూనే ఉంది.

Sid Sriram : ఒక్క పాటకు లక్షల్లో ఛార్జ్ చేస్తున్న సిద్ శ్రీ రామ్

ఈయన రెమ్యునరేషనే ఇప్పుడు ఇక్కడ చర్చగా మారింది. సాధారణంగా ప్రస్తుతం ఏ సింగర్ కైనా ఒక్క పాట పాడితే వారికి రూ. 20 వేలను పారితోషికంగా ఇస్తున్నారు. ఒకవేళ వారు టాప్ సింగర్ అయితే రూ. 50 వేలు మరీ ఫేమస్ సింగర్ అయితే రూ. లక్ష వరకే ఇస్తున్నారు. కానీ సిద్ శ్రీరామ్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు కాబట్టి… ఆయనకు మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఒక్క పాటకు గానూ సుమారు రూ. 4.5లక్షల వరకు ఇస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మిగతా గాయకులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అయినప్పటికీ యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా సిద్ అడిగినంత నిర్మాతలు ఆయనకు ముట్ట చెబుతున్నారని సమాచారం.

singer Sid Sriram remuneration News going viral

singer Sid Sriram remuneration News going viral

సిద్ పాడిన ప్రతీ పాట ఈ మధ్య ఎంత పెద్ద హిట్ అవుతోందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఫెయిల్ అయినా సరే ఈయన పాడిన ప్రతీ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని కొన్ని సినిమా లైతే భారీ బడ్జెట్ చిత్రాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా గీత గోవిందం, అల వైకుంఠ‌పురం సినిమాలలో సిద్ పాడిన పాట‌లు ఓ రేంజ్ లో అలరించాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp