Mangli : మంగ్లీపై ప్రశంసలు.. సిధ్ శ్రీరామ్ రిప్లై వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: March 9, 2021, 7:30 pm

Mangli : రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగ్లీ, మంగ్లీ గాత్రం గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. కొన్ని పాటలు వింటే మంగ్లీ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆమె పాటకు ఎవరు డ్యాన్సులు వేస్తున్నారు.. తెరపై ఎవరు కనిపిస్తున్నారు అనే విషయాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోరు. అందరినీ అన్నింటిని ఆమె గొంతే డామినేట్ చేసేస్తుంటుంది. అలాంటి మంగ్లీ సారంగదరియా పాటతో ఇప్పుడు దూసుకుపోతోంది.

సారంగ దరియా పాట మీద ఎన్ని కాంట్రవర్సీలు జరిగినా, కోమలి అనే మహిళా మంగ్లీపై కామెంట్స్ చేస్తూ బాగా పాడలేదని విమర్శించినా కూడా పాట మాత్రం దూసుకుపోతూనే ఉంటోంది. సాయి పల్లవి మ్యాజిక్, మంగ్లీ వాయిస్ ఇలా అన్నీ కలిసి సారంగదరియా యూట్యూబ్ దునియాను దున్నేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొడుతూ ఇంకా నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది.

sid sriram about mangli saranga dariya Mangli

sid sriram about mangli saranga dariya Mangli

Mangli : మంగ్లీపై ప్రశంసలు.. సిధ్ శ్రీరామ్ రిప్లై వైరల్

అయితే ఈ పాటపై రాహుల్ రవీంద్రన్ కామెంట్ చేశాడు. కారులో వెళ్తోంటే విన్నాను.. రోజంతా వింటూనే ఉన్నాను.. ఈ పాటలో ఏదో ఒక అద్భుతం ఉందంటూ సారంగదరియా, మంగ్లీ గురించి కామెంట్ చేశాడు. అయితే ఆ కామెంట్‌కు సిధ్ శ్రీరామ్ స్పందించాడు. అవును మంగ్లీ వాయిస్ ఓ అద్భుతం అంటూ ప్రశంసించేశాడు. సౌత్ ఫేమస్ అయిన సిధ్ శ్రీరామ్.. మంగ్లీ వాయిస్‌కు ఫిదా అయ్యాడంటే మామూలు విషయం కాదు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp