Home » Entertainment » Singer Sunitha Enjoys Nature And Rain
Entertainment

Sunitha : వాటిని చూస్తే ఆనందంగా ఉంటుంది!.. తడిసి ముద్దైన సింగర్ సునీత

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 5, 2021, 8:48 am
Advertisement

Sunitha సింగర్ సునీత Sunitha ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. గోవాలో సునీత మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. అయితే గోవా అంటే మాత్రం అందరూ బీచ్‌లు, బికినీలు అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ప్రకృతి ప్రేమికులను అబ్బురపరిచే పచ్చదనం కూడా గోవాలో ఉందని తక్కువ మందికి తెలుసు. అలా సునీత కూడా ఆ పచ్చదనాన్ని ఎంజాయ్ చేసేందుకు గోవాకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె షేర్ చేస్తోన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Singer Sunitha Enjoys Nature And Rain

తన లాంటి ప్రకృతి ప్రేమికులు గోవా కూడా అద్భుతంగా ఉంటుందని కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్స్‌తో పాటు వెళ్లానని, అలా వెళ్లినప్పుడు ఫ్రెండ్స్‌ను ఫోటోలు తీయమని డిమాండ్ చేయవచ్చు అని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా సునీత మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన గురించి, తన చిన్ని చిన్ని ఆనందాలు, తన ప్రపంచం గురించి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా వర్షంలో తడిసినట్టుగా.. ఆ జుట్టును ఆరబెట్టుకున్నట్టుగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Singer Sunitha Enjoys Nature And Rain

Sunitha వర్షంలో తడిసిన సునీత

నా కెరీర్, ఫ్యామిలీ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే నేను.. దేవుడు సృష్టించిన ఈ చిన్న చిన్న అద్భుతాలను గుర్తిస్తుంటాను.. ఆస్వాధిస్తుంటాను. సూర్యోదయం, వర్షం, నా చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి వంటిని చూసి పులకిస్తుంటాను. వాటన్నంటిని చూస్తే నాకు ఎంతో ఆనందమేస్తుంది. నా వ్యక్తిగతమైన, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన పాజిటివిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ సునీత కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

Advertisement

Singer Sunitha Enjoys Nature And Rain

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి