Home » Entertainment » Singer Sunitha Marriage With Ram Postponed
Entertainment

సింగర్ సునీత పెళ్లి వాయిదా!.. కారణం ఏంటంటే?

Authored By
Admin
The Telugu News | Updated on: December 15, 2020, 9:14 pm
Advertisement

సింగర్ సునీత ప్రస్తుతం వార్తల్లో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. రెండో పెళ్లికి సంబంధించి ఎన్నో పుకార్లు హల్చల్ చేయగా.. చివరకు వాటన్నంటిపై ఓ క్లారిటీ వచ్చింది. గత వారంలో సునీత తన పెళ్లికి సంబంధించి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నిశ్చితార్థం ఫోటోలు అంటూ బయటకు వచ్చిన కొద్దిసేపటికే సునీత స్పందించింది. తాను పెళ్లి చేసుకోబోతోన్నట్టు అందరికీ ఓపెన్‌గా చెప్పేసింది.

Advertisement

Singer Sunitha Marriage With Ram Postponed

వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని తాను వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పుకొచ్చింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటుందో వివరించింది. తన పిల్లల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రామ్ చాలా మంచివారని, ఆయనతో తన మిగిలిన జీవితాన్ని పంచుకోబోతున్నానని చెప్పుకొచ్చింది.

Advertisement

అయితే రామ్-సునీత వివాహం డిసెంబర్ 27న హైదరాబాద్‌లో జరగనుందని నిన్నమొన్నటి వరకు ప్రచారం జరిగింది. సునీత సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ పెళ్లి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారని అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయని తెలుస్తోంది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి