Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో దాదాపు డెబ్బై కెమెరాలుంటాయి. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా కూడా తెలిసిపోతుంది. తప్పుడు మాటలు మాట్లాడిన, తప్పుడు ఆరోపణలు చేసినా కూడా ఇట్టే తెలిసిపోతోంది. లోపల ఉన్న కంటెస్టెంట్లకు సరిగ్గా తెలియక.. పైపైన చూసి నిర్ణయానికి వస్తారు. కానీ బిగ్ బాస్ కళ్లు మాత్రం అందరినీ నిశితంగా పరిశిస్తుంటుంది. అలా రెండో వారంలో సిరి తన ఉమెన్ కార్డును వాడింది. సన్ని తన టీ షర్ట్ లోపల చేయి పెట్టాడంటూ నానా రచ్చ చేసింది.
పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా షన్ను కూడా రెచ్చిపోయాడు. సన్నీ ఏదో తప్పు చేసినట్టుగా, నిజంగా చేయి లోపల పెట్టినట్టుగా షన్ను ఆరోపణలు చేశాడు. తాను అలా చేయలేదంటూ మొత్తుకున్నా సన్నీని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఇలానే ప్రతీ సీజన్‌లోనూ జరుగుతూ వస్తోంది. ఓ లేడీ కంటెస్టెంట్.. మగ కంటెస్టెంట్ మీద ఆరోపణలు చేస్తూనే వస్తోంది. కౌశల్ మీద భాను, అలీ రెజా మీద హిమజ, సోహెల్ మీద అరియానా ఇలా ఆరోపణలు చేసిన వారే.
ఇక నాగార్జున శనివారం నాటి ఈ ఎపిసోడ్‌లో అసలు సంగతేంటో చూపించాడు. వీడియో ప్లే చేసి మరీ గుట్టు విప్పాడు. సన్నీకి ఏ పాపం తెలియదని నిరూపించాడు. సిరి చేసిన తప్పుడు ఆరోపణలు ఎండగట్టి.. మొహం తెల్లబోయేలా చేశాడు. షన్ను కూడా నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. ఓ వ్యక్తికి ఉన్న వ్యక్తిత్వాన్ని చంపొద్దు.. తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అందరికీ సూచించాడు. దీంతో సిరి, షన్నుల పరువుమొత్తం పోయినట్టైంది.
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
This website uses cookies.