Bigg Boss 5 Telugu : అడ్డంగా దొరికిపోయిన సిరి.. షణ్ముఖ్ పరువుకూడా పాయే!
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో దాదాపు డెబ్బై కెమెరాలుంటాయి. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా కూడా తెలిసిపోతుంది. తప్పుడు మాటలు మాట్లాడిన, తప్పుడు ఆరోపణలు చేసినా కూడా ఇట్టే తెలిసిపోతోంది. లోపల ఉన్న కంటెస్టెంట్లకు సరిగ్గా తెలియక.. పైపైన చూసి నిర్ణయానికి వస్తారు. కానీ బిగ్ బాస్ కళ్లు మాత్రం అందరినీ నిశితంగా పరిశిస్తుంటుంది. అలా రెండో వారంలో సిరి తన ఉమెన్ కార్డును వాడింది. సన్ని తన టీ షర్ట్ లోపల చేయి పెట్టాడంటూ నానా రచ్చ చేసింది.
సిరి, షన్నులకు నాగ్ క్లాస్ Bigg Boss 5 Telugu
పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా షన్ను కూడా రెచ్చిపోయాడు. సన్నీ ఏదో తప్పు చేసినట్టుగా, నిజంగా చేయి లోపల పెట్టినట్టుగా షన్ను ఆరోపణలు చేశాడు. తాను అలా చేయలేదంటూ మొత్తుకున్నా సన్నీని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఇలానే ప్రతీ సీజన్‌లోనూ జరుగుతూ వస్తోంది. ఓ లేడీ కంటెస్టెంట్.. మగ కంటెస్టెంట్ మీద ఆరోపణలు చేస్తూనే వస్తోంది. కౌశల్ మీద భాను, అలీ రెజా మీద హిమజ, సోహెల్ మీద అరియానా ఇలా ఆరోపణలు చేసిన వారే.
ఇక నాగార్జున శనివారం నాటి ఈ ఎపిసోడ్‌లో అసలు సంగతేంటో చూపించాడు. వీడియో ప్లే చేసి మరీ గుట్టు విప్పాడు. సన్నీకి ఏ పాపం తెలియదని నిరూపించాడు. సిరి చేసిన తప్పుడు ఆరోపణలు ఎండగట్టి.. మొహం తెల్లబోయేలా చేశాడు. షన్ను కూడా నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. ఓ వ్యక్తికి ఉన్న వ్యక్తిత్వాన్ని చంపొద్దు.. తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అందరికీ సూచించాడు. దీంతో సిరి, షన్నుల పరువుమొత్తం పోయినట్టైంది.
. @iamnagarjuna in fire mode ????..let’s wait for some pending clarifications #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa#FiveMuchFun pic.twitter.com/l8z9GJDqdI
— starmaa (@StarMaa) September 18, 2021