Sita Ramam Movie First Day Collections : సీతారామం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ .. ఎంత రాబట్టింది అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sita Ramam Movie First Day Collections : సీతారామం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ .. ఎంత రాబట్టింది అంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :6 August 2022,11:30 am

Sita Ramam Movie First Day Collections : కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో స‌క్సెస్ అనేది క‌రువు కాగా, ఇప్పుడు అంద‌రి దాహాన్ని సీతారామం మూవీ తీర్చింది. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన చిత్రం సీతారామం.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ కథగా, మిలిటరీ నేపథ్యంగా దేశభక్తిని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్‌ టాక్ పాజిటివ్‌గా రావడం, సినీ క్రిటిక్స్ అంతా భారీగా రేటింగ్స్ ఇవ్వడంతో మంచి ఓపెన్సింగ్ వచ్చాయి.

Sita Ramam Movie First Day Collections : సీతారామం హ‌వా..

తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా అమెరికాలో కూడా సీతారామం సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను 227 లొకేషన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా ప్రీమియర్ల రూపంలో 90K డాలర్లు, తొలి రోజు కలెక్షన్లతో కలిపి 100k వసూళ్లను సాధించింది. సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజున 5 కోట్లకుపైగా గ్రాస్, 3 కోట్లకుపైగా షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చిత్ర యూఎస్​ఏ ప్రీమియర్​ కలెక్షన్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. దాదాపు 182 లొకేషన్స్​లో విడుదలై ఈ చిత్రం ​ 43 లక్షల 23 వేల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

sitaramam first day collections

sitaramam first day collections

సీతారామం సినిమా నైజాంలో అత్యధికంగా 5 కోట్లు, సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సీతా రామం సినిమా 14 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 70 లక్షలు, ఓవర్సీస్ 2.5 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19.50 కోట్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది