Sitara: పరశురాం దర్శకత్వంలో మహేశ్, కీర్తి సురేశ్ జంటగా రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేశ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పరశురామ్ దీనిని ఒక పక్కా కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటివరకు సర్కారు వారి పాట నుండి ఓ టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా ‘కళావతి’ అనే పాట నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సినిమాలో ఈ ఒక్క సాంగ్ కోసమే చాలా ఖర్చు అయ్యిందంటూ టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సాంగ్ కి చాలా మంది రీల్స్ చేస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పాటని అనుకరిస్తూ రచ్చ చేస్తుండగా, ఇప్పుడు ఈ లిస్ట్ లో సితార చేరింది.
తాజాగా కళావతి సాంగ్‌కి స్టెప్పేసి యమ అట్రాక్ట్ చేసింది మహేష్ గారాలపట్టి సితార. ఇందుకు సంబంధించిన వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.’ఇంకా ఏం చెప్పగలను? లవ్ లవ్ లవ్ యూ మై లిటిల్ వన్’ అని ట్యాగ్ చేస్తూ నమ్రత శిరోద్కర్ ఈ వీడియోను పంచుకోవడం స్పెషల్ సర్‌ప్రైజ్‌గా ఫీల్ అవుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇందులో సితార స్టెప్పులు చూసి ఫిదా అవుతూ ‘వావ్, సూపర్, అమేజింగ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే సోలోగా సితార పిచ్చెక్కిచిందనే చెప్పుకోవాలి. సితార వేసిన స్టెప్పులపై మహేశ్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా, ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ లిరికల్ వీడియోకు 24 గంటల్లోపే మిలియన్లలో వ్యూస్ సాధించింది .అయితే మూవీ టీమ్ అంతా ఈ పాట షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లింది. అయితే ఈ పాట కోసం కనీసం రూ. 40 నుండి 60 లక్షలు ఖర్చు అయిండొచ్చని ఫిల్మ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సిద్ శ్రీరామ్ ఈ పాట పాడగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ రాసారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ కానుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.