Sitara : ఇవాళ అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియా మదర్స్ డే విషెస్‌తో మార్మోగుతుంది. నిజానికి విదేశాల్లో మొదలైన ఈ మదర్స్ డే… ఇప్పుడు మన దేశంలోనూ బాగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. తల్లి కోసం కేవలం ఒక్కరోజు కేటాయించడమేంటన్న విమర్శలూ దీనిపై ఉన్నాయి. తల్లి కోసం ఒక్క రోజు అని కాదు కానీ… ఆ ప్రేమమయి, నిస్వార్థ త్యాగమయి జీవితాన్ని సెలబ్రేట్ చేసేందుకు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించడంలో తప్పేముందన్న వాదన కూడా ఉంది. అయితే పలువురు ప్రముఖులు మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు.
మహేష్ గారాల పట్టి సితార తన తల్లికి మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. అమ్మ కోసం స్పెషల్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను. అది సర్‌ప్రైజ్. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. వసరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్. మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్ అంటూ పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది సితార. ఇక మహేష్ కూడా తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నా తల్లికి నా లైఫ్ లైన్స్ అయిన నా బిడ్డల తల్లికి వారితో పాటుగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి మదర్స్ డే విషెష్ ని తెలియజేస్తున్నానని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇవి వైరల్‌గా మారాయి.సితార ఏది చేయాలనిపిస్తే అది చేసేలా మహేశ్-నమ్రత స్వేచ్చ నిచ్చారని ఈ స్టార్ కిడ్‌ను చూస్తే తెలిసిపోతుంది.
అంతేకాదు ఇంత చిన్న వయస్సులో సితారకు వస్తున్న పాపులారిటీ, మీడియా అటెన్షన్ పట్ల మహేశ్ కానీ, నమ్రత కానీ ఏమాత్రం భయపడటం లేదట. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ..సితార ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో..అది చేసేలా తాము ప్రోత్సహిస్తున్నామంది.ఈ వయస్సులో పిల్లలు గైడెన్స్ అవసరమని భావిస్తున్నట్టు చెప్పింది. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో చేయాల్సిన పనిని చేసేలా సితారకు మార్గనిర్దేశం చేసేందుకుమహేశ్, తాను ఉన్నామని తెలిపింది. ఏది చేయాలో ఏది చేయకూడదనే అంశాలతో చాలా క్లారిటీతో సితార తన లిమిట్స్ లో ఉంటూనే ముందుకు సాగుతుందని చెప్పుకొచ్చింది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.