Mahesh Babu : నాన్న‌మ్మ మృతితో వెక్కివెక్కి ఏడ్చిన సితార‌.. ఓదార్చిన మ‌హేష్ బాబు

Authored By Sam C | The Telugu News | Updated on: September 28, 2022, 12:41 pm

Mahesh Babu : సూప‌ర్ స్టార్ కృష్ణ మొద‌టి భార్య‌, మ‌హేష్ త‌ల్లి ఇందిరా దేవి ఈ రోజు తెల్ల‌వారుజామున క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇందిరా దేవి అకాల మరణంతో ఇప్పుడు ఘట్టమనేని వారి ఇంట సహా టాలీవుడ్ లో తీరని విషాదం నెల‌కొంది ఈ ఉదయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనితో ఈ విషాద సమయంలో మెగాస్టార్ చిరంజీవి సహా ఎందరో సినీ ప్రముఖులు మహేష్ మరియు కృష్ణ గార్లకి ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా దేవి పార్థివ దేహాన్ని అయితే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్ లోనే ఉంచగా తరువాత హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లో మహాప్రస్థానంలో వారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Mahesh Babu : సితార ఫుల్ ఎమోష‌న‌ల్..

మ‌హేష్ కూతురు సితార‌కి త‌న నాన్న‌మ్మ అంటే ఎంతో ప్రాణం. ఇక ఆమె లేదు అనే విష‌యం తెలుసుకున్న సితార వెక్కి వెక్కి ఏడ్చింది. మ‌హేష్ ఎంత ఓదార్చిన కూడా సితార వెక్కి వెక్కి ఏడ్వ‌డం అంద‌రిని క‌లిచి వేసింది. సితార, గౌత‌మ్ అప్పుడ‌ప్పుడు హాలీడేస్ స‌మ‌యంలో త‌న నాన్న‌మ్మ ఇంటికి వెళ్లి స‌రదాగా గ‌డిపి వ‌స్తుంటార‌నే విష‌యం తెలిసిందే. ఇప్పుడు త‌న నాన్న‌మ్మ ఇక లేద‌ని తెలిసి చాలా బాధ‌ప‌డుతున్నారు. కృష్ణ, ఇందిర దంపతులకు ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానంగా ఉన్నారు.

Sithara Ghattamaneni Cried For Her GrandMother.. Mahesh Babu consoled Her

Sithara Ghattamaneni Cried For Her GrandMother.. Mahesh Babu consoled Her

దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ‌, ఇందిరాల‌కి ఇద్దరు కొడుకులు రమేశ్ బాబు, మహేశ్ బాబు సినిమాల్లో రాణించగా కూతురు మంజుల కూడా కొన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.ఇందిర పుట్టిన రోజు, మదర్స్ డే, ఉమెన్స్ డే సందర్భాల్లో తమ తల్లికి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి సంతోషపెట్టేవారు మహేశ్ బాబు. గతంలో మరో భార్య విజయనిర్మల మరణించగా ఇప్పుడు ఇందిర దూరం కావడంతో కృష్ణ శోకసంద్రంలో మునిగిపోయారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp